Share News

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు.. లిస్టింగ్ కంపెనీలివే..

ABN , Publish Date - Jan 26 , 2025 | 12:42 PM

స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వారం వచ్చేసింది. ఈసారి జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే వారంలో 2 కొత్త IPOలు, 6 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఆ కంపెనీల వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు.. లిస్టింగ్ కంపెనీలివే..
Upcoming IPOs Listings January 27th

దేశీయ స్టాక్ మార్కెట్లో (stock market) మళ్లీ ఐపీఓల (IPOs) వీక్ రానే వచ్చింది. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఈసారి తక్కువ కార్యకలాపాలు ఉండనున్నాయి. ఎందుకంటే పెట్టుబడిదారులకు కేవలం రెండు కొత్త ఐపీఓలు మాత్రమే ఈసారి అందుబాటులో ఉంటాయి. కొత్తగా ప్రారంభమయ్యే ఐపీఓలలో ఒకటి మెయిన్‌బోర్డ్ విభాగంలో డాక్టర్ అగర్వాల్ హెల్త్‌కేర్ కంపెనీకి సంబంధించినది. దీంతోపాటు 6 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. అయితే ఈ వారం ప్రారంభమయ్యే ఐపీఓలు, లిస్టింగ్ కంపెనీల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే వారంలో కొత్త ఐపీఓలు

1. మల్పానీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ ఐపీఓ (మల్పానీ పైప్స్)

ఈ ఐపీఓ జనవరి 29న ప్రారంభమవుతుంది. జనవరి 31న ముగుస్తుంది. ఇది SME విభాగానికి చెందిన ఒక ఇష్యూ కాగా, రూ.25.92 కోట్ల మేర మొత్తం ఫండ్ రైజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.85-90 మధ్య ధరను నిర్ణయించారు. మొత్తం 1600 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. ఈ షేర్లు ఫిబ్రవరి 5న BSE SME లో లిస్టింగ్ కానున్నాయి.

2. డాక్టర్ అగర్వాల్ హెల్త్‌కేర్ ఐపీఓ

ఇది మరొక కీలక IPO. జనవరి 29న ప్రారంభమై, జనవరి 31న ముగుస్తుంది. ఇది మెయిన్‌బోర్డ్ మార్కెట్‌కు చెందినది. డాక్టర్ అగర్వాల్ హెల్త్‌కేర్ సుమారు రూ. 3,027.26 కోట్లు సేకరించాలనుకుంటోంది. ఈ షేర్ల ధర బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.382-402గా నిర్ణయించారు. ఈ షేర్లు ఫిబ్రవరి 5న BSE మరియు NSEలో లిస్ట్ కావచ్చు. హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులు పెంచాలనుకునే వాళ్ళకు ఇది మంచి అవకాశంగా ఉంటుందని ఆశిస్తున్నారు.


ఇప్పటికే మొదలైన ఐపీఓలు

1. CLN ఎనర్జీ ఐపీఓ

ఈ ఐపీఓ రూ.72.30 కోట్ల మేర ఇష్యూ అవుతుంది. జనవరి 23న ప్రారంభమైన ఈ ఐపీఓ, జనవరి 27న ముగుస్తుంది. ఈ ఇష్యూ జనవరి 30న BSE SMEలో లిస్టింగ్ అవుతుంది. షేర్ల ధర బ్యాండ్ రూ.235-250 మధ్య ఉంటుంది. పెట్టుబడిదారులు ఒక్కో లాట్‌లో 600 షేర్లను బిడ్ చేయవచ్చు.

2. హెచ్.ఎం. ఎలక్ట్రో మెక్ ఐపీఓ

ఈ ఐపీఓ రూ.27.74 కోట్లతో జనవరి 24న ప్రారంభమై, జనవరి 28న ముగుస్తుంది. ఈ షేర్ల ధర బ్యాండ్ రూ.71-75 మధ్య ఉంటుంది. లాట్ సైజు 1600 షేర్లుగా నిర్ణయించబడింది. జనవరి 31న ఈ షేర్లు BSE SME లో లిస్ట్ అవుతాయి.


3. GB లాజిస్టిక్స్ కామర్స్ ఐపీఓ

ఈ ఐపీఓ రూ.25.07 కోట్లు సేకరించేందుకు 24 జనవరి నుంచి 28 జనవరి వరకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 6 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. షేర్ల ధర పరిధి రూ.95-102 మధ్య ఉంది. లాట్ సైజు 1200 షేర్లు. ఈ షేర్లు జనవరి 31న BSE SMEలో లిస్టింగ్ అవుతాయి.

ఈ వారం కింది కంపెనీలు తమ షేర్లను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయనున్నాయి

1. క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్

ఈ కంపెనీ తన షేర్లను జనవరి 27న BSE SMEలో జాబితా చేయనుంది. కంపెనీ మార్కెట్ ప్రదర్శనపై పెట్టుబడిదారులు చాలా ఆసక్తిగా ఉన్నారు.


2. డెంటా వాటర్, ఇన్‌ఫ్రా సొల్యూషన్స్

ఈ రెండు కంపెనీలు జనవరి 29న BSE, NSE మెయిన్‌బోర్డ్లో జాబితా అవుతాయి.

3. రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్

ఈ సంస్థ జనవరి 29న NSE SMEలో లిస్టింగ్ అవుతుంది. SME విభాగంలో ఇది మంచి కలెక్షన్‌కు దారితీస్తోంది

4. CLN ఎనర్జీ

ఈ కంపెనీ తన షేర్లను జనవరి 30న BSE SMEలో జాబితా చేయనుంది. వీటి మార్కెట్ ఆఫర్ కూడా మంచి విజయం సాధించినట్లు కనిపిస్తోంది.

5. హెచ్.ఎం. ఎలక్ట్రో మెక్, GB లాజిస్టిక్స్ కామర్స్

ఈ రెండు కంపెనీలు జనవరి 31న BSE SMEలో తమ షేర్లను జాబితా చేయనున్నాయి.

వచ్చే వారం మార్కెట్లో 6 కంపెనీలు తమ షేర్లను లిస్టింగ్ చేయనున్నాయి. ఇందులో పెట్టుబడిదారులు నూతన ఐపీఓలు, లిస్టింగ్ కంపెనీల గురించి మరింత వివరాలు తెలుసుకుని తమ పెట్టుబడులను సురక్షితంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మీరు పెట్టుబడులు చేసే ముందు ఆయా కంపెనీల గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి.


ఇవి కూడా చదవండి:

Viral Video: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హెలికాప్టర్ల ప్రదర్శన చూశారా..


Droupadi Murmu: జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. గన్స్‌తో సెల్యూట్


RepublicDay 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఏమన్నారంటే..


Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు


Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్‌..


Gold and Silver Rates Today: పైపైకి వెళ్తున్న పసిడి రేట్లు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 12:44 PM