Share News

Elon Musk: కుంభమేళాకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం.. వస్తారని అంటున్న..

ABN , Publish Date - Jan 18 , 2025 | 09:28 PM

మహా కుంభమేళా 2025కు రావాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో ఆయన కుంభమేళాకు వస్తారని ఆయనను కలిసిన ప్రముఖ వ్యాపారవేత్తలు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Elon Musk: కుంభమేళాకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం.. వస్తారని అంటున్న..
Elon Musk Maha Kumbh Mela 2025

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగ అయిన మహా కుంభమేళా 2025 (Maha Kumbh Mela 2025) ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రతి రోజు కూడా కోట్లాది మంది వస్తున్నారు. ప్రస్తుతం ఈ మహా కుంభమేళా ఒక కార్యక్రమం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విదేశీ మీడియా కూడా ఈ మహా కుంభమేళా గురించి విస్తృతంగా కవర్ చేస్తోంది. అయితే ఈ మహా కుంభమేళాకు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (ElonMusk) కూడా ఉన్నారనేది తాజా సమాచారం.


తప్పకుండా రావచ్చని..

ఈ విషయాన్ని ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి వెల్లడించారు. టెక్సాస్‌లో భారతీయ బిజినెస్ లీడర్లతో సమావేశమైనప్పుడు, ఎలాన్ మస్క్‌కు మహా కుంభమేళా ఆహ్వానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త రితేష్ అగర్వాల్ కూడా పాల్గొని, మస్క్‌తో తన అనుభవాలను పంచుకున్నారు. మహా కుంభమేళాకు మస్క్ ఆహ్వానం అందుకున్నారు. మేము ఆయన వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన తప్పకుండా రావచ్చని అమిష్ త్రిపాఠి అభిప్రాయం వ్యక్తం చేశారు.


మహా కుంభమేళాపై మస్క్ స్పందన..

మహా కుంభమేళా గురించి ఎలాన్ మస్క్ చాలా ఉత్సాహంగా ఉన్నారని రితేష్ అగర్వాల్ ఈ సందర్భంగా అన్నారు. మస్క్ భారతదేశాన్ని ప్రస్తావిస్తూ "భారతదేశం ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి, అక్కడ వైవిధ్యం ఎంతో ఉంది" అని చెప్పారు. అలాగే "భారతదేశం, అమెరికా మధ్య బలమైన సంబంధాలు ఉంటే, ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్సాహం వస్తుందని మస్క్ అభిప్రాయపడినట్లు రితేష్ తెలిపారు. మస్క్‌తో జరిగిన ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా సాగిందని అమిష్ త్రిపాఠి, రితేష్ అగర్వాల్ అన్నారు. ఈ సమావేశంలో మేము ఆధ్యాత్మికత, పర్యాటకం, ద్రవ్య విధానం, ఇంజనీరింగ్ వంటి అనేక అంశాలను చర్చించామని అమిష్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.


అవును, మస్క్ రావచ్చు

మహా కుంభమేళా 2025కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ రవడానికి ఆసక్తిగా ఉన్నారని రితేష్ అగర్వాల్ తెలిపారు. "మేము మస్క్‌ను ఆహ్వానించాం, ఆయన ఖచ్చితంగా రావచ్చన్నారు. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశం గురించి రితేష్ అగర్వాల్ మరొక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "భారతీయ శాఖాహారాన్ని టెక్సాస్‌లో తిన్నానని, తనకు కేటాయించిన భోజనం చాలా రుచికరంగా అనిపించిందని రితేష్ తెలిపారు. ఆయన పోస్ట్ చేసిన ఫోటోలో టెస్లా సీఈఓ మస్క్, రితేష్ అగర్వాల్, అమిష్ త్రిపాఠి సహా ఇతర ప్రముఖులు ఉన్నారు.


ప్రముఖులతో సమావేశం..

ఈ సమావేశంలో ఫ్లిప్‌కార్ట్ యజమాని కళ్యాణ్ రామన్, ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ బిర్లా కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం భారతదేశం, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలపరచడమే కాక, మహా కుంభమేళాకు ఎలాన్ మస్క్ వంటి వ్యక్తులను ఆకర్షించడం కూడా భారతదేశం ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 18 , 2025 | 09:42 PM