Tata Capital IPO 2025: అక్టోబర్ 6న రూ.15 వేల కోట్లతో టాటా క్యాపిటల్ ఐపీఓ
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:55 PM
ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ అద్భుతమైన జోష్‌లో ఉంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా కంపెనీలు భారీగా నిధులు సేకరిస్తున్నాయి. ఇక అసలు హైప్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే టాటా గ్రూప్ నుంచి మరో బిగ్ ఐపీఓ రాబోతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల మార్కెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు టాటా గ్రూప్ నుంచి భారీ IPO రాబోతుంది. ప్రముఖ NBFC కంపెనీ అయిన టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లను సేకరించేందుకు IPOను (Tata Capital IPO 2025) ప్రారంభించనుంది. ఈ ఇష్యూ అక్టోబర్ 6-8, 2025 వరకు ఉంటుంది, ఒక్కో షేరుకు ధర రూ.310-326గా నిర్ణయించారు. ఇది భారతదేశ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
టాటా క్యాపిటల్
టాటా క్యాపిటల్ దేశంలోని అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటి. ఇందులో వినియోగదారులకు సంబంధించి గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు సహా పలు ఉత్పత్తులు ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్ దీనిలో 88.6% వాటాను కలిగి ఉంది. మిగిలిన వాటాలు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో టాటా సన్స్ వాటాను తగ్గించనున్నారు.
ఈ ఏడాది
2025లో ఇప్పటివరకు 74 IPOల ద్వారా కంపెనీలు సుమారు రూ.85,000 కోట్లు సేకరించాయి. అక్టోబర్‌లో పెద్ద ఇష్యూలతో ఈ సంఖ్య రూ.1 లక్ష కోట్లను దాటే అవకాశం ఉంది. ఇది భారత మార్కెట్ చరిత్రలో మూడోసారి ఇంత పెద్ద మొత్తం సేకరణ జరగనుంది. గతంలో 2021లో రూ.1.19 లక్షల కోట్లు, 2024లో రూ.1.6 లక్షల కోట్లు సేకరించబడ్డాయి.
వీవర్క్ ఇండియా IPO
టాటా క్యాపిటల్‌తో పాటు, వీవర్క్ ఇండియా కూడా రూ.3,000 కోట్ల IPOను అక్టోబర్ 3-7 వరకు ప్రారంభించబోతోంది. దీని షేరు ధర రూ.615-648గా నిర్ణయించబడింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS), దీనిలో ఎంబసీ గ్రూప్, వీవర్క్ గ్లోబల్ తమ వాటాలను విక్రయిస్తాయి. ఈ షేర్లు అక్టోబర్ 10న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. LG ఇండియా కూడా అక్టోబర్ అర్ధభాగంలో రూ.15,000 కోట్ల IPOను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో 2025లో మొత్తం సేకరణ రూ.1.3 లక్షల కోట్లను దాటవచ్చు.
గమనిక: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి