Stock Markets: భారీ నష్టాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లు.. లబోదిబో అంటున్న మదుపర్లు..
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:03 PM
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు పెద్ద ఎత్తున పడిపోయాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రపంచ మార్కెట్లలో (Stock Markets) మిశ్రమ ధోరణుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 21) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక బెంచ్‌మార్క్ సూచీలు మొత్తం నష్టాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఒకానొక సమయంలో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పడిపోయింది. నిఫ్టీ 23,200 దిగువకు చేరింది. గ్రీన్‌లో ప్రారంభమైనప్పటికీ, ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్‌లలో క్షీణత కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. దీంతో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
మార్కెట్లో భారీ అస్థిరత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలపై అధిక వాణిజ్య సుంకాలను ప్రకటించిన తర్వాత మార్కెట్లో భారీ అస్థిరత ఏర్పడింది. ట్రంప్ అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే పొరుగు దేశాలపై వాణిజ్య సుంకాలను విధించే ప్రణాళికలను ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు స్పందిస్తున్నారు. సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 1 నాటికి మెక్సికో, కెనడాపై 25% సుంకాలను విధించాలని తన పరిపాలన పరిశీలిస్తోందన్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో ట్రెంట్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, SBI, ICICI బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, అపోలో హాస్పిటల్, అల్ట్రాటెక్ సిమెంట్, BPCL, TATA కంన్య్జూమర్స్, ITC టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. Q3 ఫలితాల తర్వాత న్యూజెన్ సాఫ్ట్‌వేర్ 10% పడిపోయింది. 4 రోజుల్లో ఈ స్టాక్ 22% తగ్గింది. అద్భుతమైన Q3 ఫలితాల తర్వాత సన్‌టెక్ రియాల్టీ 11% పెరిగింది. ఈ క్రమంలో లాభం 537% పెరిగడం విశేషం. మరోవైపు Q3 తర్వాత 2 రోజుల్లో జొమాటో 12% పడిపోయింది. విశ్లేషకులు ఆదాయాలను తగ్గించారు.
వారీగా చూస్తే
ఇక రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.23 శాతం క్షీణించి, టాప్ డ్రాగ్‌గా నిలిచింది. తరువాత రియాల్టీ ఇండెక్స్ (0.92 శాతం తగ్గింది), PSU బ్యాంక్ (0.23 శాతం తగ్గింది), నిఫ్టీ బ్యాంక్ (0.05 శాతం తగ్గింది), ప్రైవేట్ బ్యాంక్ (0.04 శాతం తగ్గింది). దీనికి విరుద్ధంగా హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.17 శాతం పెరిగి అత్యధికంగా లాభపడింది. తరువాత ఫార్మా, మీడియా, ఆటో, ఐటీ, FMCG, మెటల్, ఆయిల్ సూచీలు ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందంటే..
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, చైనా షాంఘై కాంపోజిట్, హాంకాంగ్ హాంగ్ సెంగ్, దక్షిణ కొరియా కోస్పి లాభాల్లో ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సోమవారం US మార్కెట్లు మూసివేయబడ్డాయి.
ఇవి కూడా చదవండి:
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News