Stock Market: వరుసగా మూడో రోజూ లాభాలే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Aug 20 , 2025 | 03:49 PM
వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా లాభాలను ఆర్జించాయి.
వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. జీఎస్టీలో సంస్కరణలు, భారత్‌పై ఆంక్షల విషయంలో డొనాల్డ్ ట్రంప్ కాస్తా నెమ్మదించడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా లాభాలను ఆర్జించాయి (Business News).
మంగళవారం ముగింపు (81, 644)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. బుధవారం సెన్సెక్స్ 81, 494-81,985 మధ్యలో శ్రేణి కదలాడింది. చివరకు సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 81, 857 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 69 పాయింట్ల లాభంతో 25, 050 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ఇండియన్ హోటల్స్, ఫియోనిక్స్ మిల్స్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, కోల్గేట్ షేర్లు లాభాలను ఆర్జించాయి. అరబిందో ఫార్మా, భారత్ ఫోర్జ్, ముత్తూట్ ఫైనాన్స్, సింజిన్ ఇంటెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 265 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.06గా ఉంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి