Stock Market: రెండో రోజూ లాభాలే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:53 PM
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారంలో మాత్రం లాభాల జోష్‌లో సాగుతున్నాయి. జీఎస్టీలో సంస్కరణలు, భారత్‌పై ఆంక్షల విషయంలో డొనాల్డ్ ట్రంప్ కాస్తా నెమ్మదించడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారంలో మాత్రం లాభాల జోష్‌లో సాగుతున్నాయి. జీఎస్టీలో సంస్కరణలు, భారత్‌పై ఆంక్షల విషయంలో డొనాల్డ్ ట్రంప్ కాస్తా నెమ్మదించడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో లాభాలను ఆర్జించాయి (Business News).
సోమవారం ముగింపు (81, 273)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 500 పాయింట్లు లాభపడి 81,755 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో 81, 644 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 103 పాయింట్ల లాభంతో 24, 980 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో మదర్సన్, ఐఐఎఫ్‌ఎల్, పేటీఎమ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి. భారత్ డైనమిక్స్, కల్యాణ్ జువెల్లర్స్, సోలార్ ఇండస్ట్రీస్, క్యామ్స్, రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 551 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.95గా ఉంది.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి