Share News

Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:16 AM

ఇంటర్నెట్ సేవల విషయంలో దేశంలో వినియోగదారులు మరింత మెరుగైన సేవలను పొందనున్నారు. ఎందుకంటే తాజాగా జియో కూడా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం
spaceX Starlink Partner with Jio

స్పేస్‌ఎక్స్‌ (SpaceX) స్టార్‌లింక్ హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలతో నిన్న ఎయిర్ టెల్ ఒప్పందం కుదుర్చుకోగా, ఈరోజు ముఖేష్ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (JPL) అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత, భారతదేశంలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ క్రమంలో టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్ నెట్ సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తల నేపథ్యంలో RIL షేర్లు ఈరోజు పుంజుకున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు కూడా లాభాలను గడించాయి. ఒక రోజు ముందు అంటే నిన్న (మార్చి 11న) స్పేస్‌ఎక్స్ భారతీ ఎయిర్‌టెల్‌తో కూడా చేతులు కలిపింది.


ఈ అగ్రిమెంట్ ద్వారా

ఈ ఒప్పందంతో మెరుగైన ఇంటర్ నెట్ సేవల కోసం జియో, స్పేస్‌ఎక్స్ (స్టార్‌లింక్) కలిసి పనిచేయనున్నాయి. ఈ క్రమంలో జియో తన రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా స్టార్‌లింక్ ఉత్పత్తులను విక్రయించనుంది. అదనంగా ఇది కస్టమర్ సర్వీస్, ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జియో దేశవ్యాప్త నెట్‌వర్క్‌తోపాటు డేటా ట్రాఫిక్‌లో కూడా అగ్ర స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో స్టార్‌లింక్ తన ఉపగ్రహ వ్యవస్థ ద్వారా భారతదేశంలోని మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించే ఛాన్సుంది.


రిలయన్స్ జియో ప్రకటన

ఈ సందర్భంగా ప్రతి భారతీయుడికి తక్కువ ధరల్లో వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ ఒమెన్ అన్నారు. స్టార్‌లింక్‌ను భారతదేశానికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌తో ఈ భాగస్వామ్యం ఒక కీలక నిర్ణయమని వెల్లడించారు. దీనిని జియో నెట్‌వర్క్‌కు యాడ్ చేయడం వల్ల అనేక మంది జియో యూజర్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ లభిస్తుందన్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా అనేక కమ్యూనిటీలు, వ్యాపారాలు కూడా బలోపేతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.


ప్రపంచానికి హై-స్పీడ్ ఇంటర్నెట్‌

ఈ ఒప్పందం తర్వాత వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు స్టార్‌లింక్ సేవలు అందించడానికి స్పేస్‌ఎక్స్ ఎయిర్‌టెల్, జియో కలిసి పనిచేస్తాయి. ఇప్పటికే స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ సేవలను పలు దేశాల్లో అందిస్తోంది. ఇది అంతరిక్షంలో 7 వేలకు పైగా ఉపగ్రహాలను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీంతో స్టార్‌ లింక్ ఇంటర్నెట్ ద్వారా స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాల్ వంటి అనేక సేవలను మరింత సులభంగా వినియోగించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: ఎర్రటి ఎలక్ట్రిక్ కారు తీసుకున్న దేశాధినేత.. ఎందుకో తెలుసా..


Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 12 , 2025 | 11:48 AM