Share News

Drone Certification: స్కైస్విఫ్ట్‌ 56 డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:47 AM

స్థానిక మారుత్‌ డ్రోన్స్‌ కంపెనీ స్కైస్విఫ్ట్‌ 56 పేరుతో మరో సరికొత్త డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌...

Drone Certification: స్కైస్విఫ్ట్‌ 56 డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్‌

హైదరాబాద్‌: స్థానిక మారుత్‌ డ్రోన్స్‌ కంపెనీ ‘‘స్కైస్విఫ్ట్‌ 56’’ పేరుతో మరో సరికొత్త డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) నుంచి సర్టిఫికేషన్‌ కూడా లభించినట్టు కంపెనీ తెలిపింది. తక్కువ బరువు, అత్యాధునిక పరికరాలు ఉండే ఈ డ్రోన్‌ను రెండు నిమిషాల్లోనే ఫిట్‌ చేసి ఉపయోగించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన నిఘా, కచ్చితమైన మ్యాపింగ్‌తో క్షేత్ర స్థాయి శిక్షణకు ఈ డ్రోన్‌ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. డ్రోన్ల ద్వారా జరిగే వ్యూహాత్మక నిఘా, పర్యవేక్ష ణలకు ఈ డ్రోన్‌ చక్కటి పరిష్కారమని మారుత్‌ డ్రోన్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకులు వీ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 03:47 AM