AI Jobs India: దేశంలో ఏఐ నిపుణులకు తీవ్ర కొరత..10 ఉద్యోగ ఖాళీలకు ఒక్కరే అర్హత
ABN , Publish Date - Aug 31 , 2025 | 09:20 PM
దేశవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ వస్తుండగా, మరికొన్ని ఏఐ రంగాల్లో మాత్రం అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత కొత్త టెక్నాలజీ నేర్చుకుని, స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మన దేశం డిజిటల్ ఆర్థిక రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. 2025 నాటికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశ GDPలో 20%కి పైగా వాటా ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ స్కిల్స్ & సాలరీ ప్రైమర్ రిపోర్ట్ (FY2025-26) తెలిపింది. ఈ పెరుగుదల వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అదే సమయంలో AI రంగంలో టాలెంట్ కొరత ఓ పెద్ద సవాలుగా మారింది.
ప్రతి 10 ఉద్యోగాలకు… ఒక్కరే
జనరేటివ్ ఏఐ (Generative AI) వంటి కొత్త సాంకేతిక రంగాల్లో ప్రతీ 10 ఉద్యోగ ఖాళీలకు కేవలం ఒకరు మాత్రమే అర్హత కలిగిన అభ్యర్థి ఉన్నారు. ఇది ప్రస్తుతం చాలా తీవ్రమైన పరిస్థితి. 2026 నాటికి ఈ AI టాలెంట్ గ్యాప్ 53%కి చేరుకుంటుందని అంచనా. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో డిమాండ్ 55-60% పెరిగే అవకాశముంది. దీంతో AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో జీతాలు భారీగా పెరుగుతున్నాయి.
ఉదాహరణకు
Generative AI Engineers, MLOps సీనియర్ ప్రొఫెషనల్స్ వార్షిక జీతం రూ.58 - రూ.60 లక్షల వరకు ఉంది
సైబర్‌సెక్యూరిటీ – సగటు జీతం 2027 నాటికి రూ. 33.5 లక్షలు, టాప్ ఎక్స్‌పర్ట్స్ రూ. 55 లక్షల వరకు పొందే అవకాశం
డేటా ఇంజినీరింగ్ – జీతాలు రూ. 27 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది, టాప్ టాలెంట్ రూ. 42 లక్షలు వరకు ఉంది
క్లౌడ్ కంప్యూటింగ్ – జీతాలు రూ. 28 లక్షలు వరకు పెరగొచ్చు. సీనియర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ రూ. 45 లక్షల వరకు కలదు
భారత్‌లో AI మార్కెట్
AI రంగం 2025 నాటికి రూ.2.4 లక్షల కోట్ల(అంటే $28.8 బిలియన్) మార్కెట్ అవుతుందని అంచనా. ఇది 45% CAGRతో పెరుగుతోంది. ఈ విస్తరణ వలన ఇండియా అంతటా వైట్ కాలర్ ఉద్యోగాలు భారీగా పెరగనున్నాయి. అందులోనూ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCs) ప్రధానంగా AI, Engineering R&Dలో 1.2 మిలియన్ (12 లక్షలు) కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా.
జీతాల్లో పెద్ద మార్పు
Prompt Engineering, LLM Safety & Tuning, AI Orchestration, Agent Design వంటి నిపుణులకి డిమాండ్ పెరుగుతోంది. ఈ రంగాల్లో ప్రత్యేకించి BFSI (బ్యాంకింగ్, ఫైనాన్స్), హెల్త్‌కేర్, మానుఫాక్చరింగ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బెంగళూరులో ఇప్పటికీ వీటికి అధిక ఉద్యోగాల డిమాండ్ ఉండగా, క్రమంగా హైదరాబాద్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు లేని టైర్-2 నగరాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు 21% పెరిగాయి.
వేగంగా పెరుగుతున్న రంగాలు
ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ ఈ రంగంలో సీనియర్ ప్రొఫెషనల్స్ జీతాలు 29% పెరిగి రూ.42 లక్షల వరకు వెళ్లొచ్చు.
Generative AI – ఈ రోల్స్‌లో జీతాలు 2025–27 సమయంలో రూ.28 లక్షల నుంచి రూ.33.5 లక్షల వరకూ పెరిగే అవకాశం ఉంది.
బిజినెస్, BFSI, రీ టెయిల్, మాన్యు ఫాక్చరింగ్ వంటి నాన్-టెక్ రంగాల్లో కూడా డిజిటల్ టాలెంట్‌కి డిమాండ్ పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి