Share News

SEBI to Offer Extra Incentives: మహిళల పెట్టుబడులపై అదనపు ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:34 AM

మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో మహిళల పెట్టుబడులను పెంచేందుకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరో చర్య చేపట్టబోతోంది...

SEBI to Offer Extra Incentives: మహిళల పెట్టుబడులపై అదనపు ప్రోత్సాహకాలు

ముంబై: మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో మహిళల పెట్టుబడులను పెంచేందుకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరో చర్య చేపట్టబోతోంది. మహిళల తొలి పెట్టుబడులను ఆకర్షించే మ్యూచువల్‌ ఫండ్లు, డిస్ట్రిబ్యూటర్లకు అదనపు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టనున్నట్లు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే శుక్రవారం తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని మరింత పెంచడంతో పాటు ప్రోత్సహించేందుకు దేశంలోని 30 అతిపెద్ద నగరాల్లో తొలిసారి పెట్టుబడి పెట్టే వ్యక్తుల నుంచి పెట్టుబడులను ఆకర్షించే డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలందించాలనుకుంటున్నాం. తొలిసారిగా పెట్టుబడి పెట్టే మహిళల నుంచి పెట్టుబడులు రాబట్టే డిస్ట్రిబ్యూటర్లకు అదనపు ప్రోత్సాహకాలందించనున్నామని ఆయ న అన్నారు. ‘‘మహిళల సమ ప్రాతినిథ్యం లేనిపక్షంలో ఆర్థిక సేవల సమ్మిళితం అసంపూర్ణం అవుతుంది. కాబట్టి మహిళల తొలి పెట్టుబడులను రాబట్టేందుకు డిస్ట్రిబ్యూషన్‌ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నాం’’ అని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) 30వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. యాంఫీ డేటా ప్రకారం.. 2024 మార్చి నాటికి ఫండ్ల నిర్వహణలోని వ్యక్తిగత ఇన్వెస్టర్ల మొత్తం ఆస్తుల్లో మహిళల వాటా 33 శాతంగా ఉంది.

మోసపూరిత ట్రేడింగ్‌ పథకాలతో జాగ్రత్త

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎ్‌ఫపీఐ) ద్వారా స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశం కల్పిస్తామంటూ సామాజిక మాధ్యమాలు, మొబైల్‌ యాప్‌ల ద్వారా ప్రోత్సహిస్తున్న మోసపూరిత ట్రేడింగ్‌ స్కీమ్‌తో జాగ్రత్తగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అవన్నీ అక్రమ పథకాలని, నియంత్రణ పరిధిలోకి రావని సెబీ స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 03:34 AM