CBDC Offline Payment System: ఇంటర్నెట్ లేకున్నా ఇక చెల్లింపులు చేసెయ్యొచ్చు
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:50 PM
జేబులో పర్సులేకపోయినా దర్జాగా మార్కెట్లోకి వెళ్లి నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అయితే, దీనికి ఫోన్, దాన్లో ఇంటర్నెట్ తప్పనిసరి. అయితే, ఇక ఆ పరిస్థితి ఉండదు. మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా దర్జాగా సరకులు కొని డబ్బులు చెల్లించొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: చేతిలో సొమ్ముల్లేకపోయినా.. జేబులో పర్సులేకపోయినా దర్జాగా మార్కెట్లోకి వెళ్లి నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి చెల్లింపులు చేయడం చూస్తున్నాం. అయితే, ఇందుకోసం పర్సులేకపోయినా ఫర్లేదు కాని, ఫోన్ మాత్రం ఉండాల్సిందే. అంతేకాదు, ఫోన్లో ఇంటర్నెట్ కూడా ఉండాలి. అప్పుడే మన ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. లేదంటే, నో ఇంటర్నెట్ అని చూపించి మిన్నకుంటుంది సదరు యాప్.
అయితే, ఇప్పుడిక ఇంటర్నెట్ చెల్లింపులకు సైతం కాలం తీరిపోతోంది. మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా దర్జాగా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నచ్చిన వస్తువులు కొనుక్కొని పేమెంట్ చేయొచ్చు. దీని కోసం భారత రిజర్వ్ బ్యాంక్ ఒక అద్భుతమైన సిస్టమ్ తీసుకొచ్చింది.
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక ముందడుగుగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారుల కోసం ఇంటర్నెట్ లేదా టెలికాం కనెక్టివిటీ లేకుండా లావాదేవీలు చేయడానికి వీలుగా ఆఫ్‌లైన్ డిజిటల్ రూపాయిని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఫీచర్ కేవలం ఒక ట్యాప్‌తో లేదా QRతో చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ డిజిటల్ డబ్బు.. భౌతిక నగదు వలె సజావుగా పని చేస్తుంది.
దీనికి UPI వలె కాకుండా నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) లేదా ఇతర సురక్షిత సామీప్య సాంకేతికతలను ఉపయోగించి రెండు డిజిటల్ వాలెట్ల మధ్య నేరుగా ఆఫ్‌లైన్ డిజిటల్ రూపాయి లావాదేవీలు జరుగుతాయి. వినియోగదారులు వారి ఫోన్ లేదా పరికరాన్ని రిసీవర్లకు నొక్కిన వెంటనే నెట్‌వర్క్ లేకపోయినా ఒక వాలెట్ నుంచి మరొక వాలెట్‌కు సొమ్ము బదిలీ అవుతుంది. దీనికి కేంద్ర బ్యాంకు ద్వారా నేరుగా మద్దతు ఇవ్వబడుతుంది. ప్రతి లావాదేవీ డిజిటల్ రూపాయి విలువలలో పూర్తి చేయబడుతుంది.
ముంబైలో ముగిసిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2025లో ఈ సరికొత్త వ్యవస్థను ప్రారంభించారు. ఇది RBI సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సూచిస్తోంది. దీంతో CBDC ఆఫ్‌లైన్ వెర్షన్‌ను అమలు చేసిన ప్రపంచంలోని తొలితరం దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News