PPF scheme: సూపర్ స్కీమ్..రూ.12,500 పెట్టుబడితో.. చేతికి రూ. 1.33 కోట్లు
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:15 PM
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పీపీఎఫ్‌లో ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. కానీ దంపతులు.. వారి పేర్లపై వేర్వేరు అకౌంట్లను తెరవచ్చు. ఏడాదికి ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే.. అది ఇద్దరి మీద రూ. 3 లక్షలు అవుతుంది.
బిజినెస్ న్యూస్: ప్రతి ఒక్కరు జీవితంలో ఆర్థికంగా మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. అలానే పెళ్లైన జంటలకు కూడా తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆర్థిక భరోసా కల్పించేందుకు అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మనం చాలా రకాల పథకాల గురించి తెలుసుకున్నాము. అయితే తాజాగా పెళ్లైన జంట కోసం ఓ సూపర్ స్కీమ్ ఉంది. ఈ పథకం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పీపీఎఫ్‌లో ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. కానీ దంపతులు(PPF scheme for couples) వారి పేర్లపై వేర్వేరు అకౌంట్లను తెరవచ్చు. ఏడాదికి ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే.. అది ఇద్దరి మీద రూ. 3 లక్షలు అవుతుంది. సంవత్సరానికి రూ. 1.50 లక్షలు అంటే నెలకు రూ. 12,500 పెట్టుబడి అవుతుంది. ఇక 20 ఏళ్ల మెచ్యూరిటీ కాలానికి మొత్తం పెట్టుబడి రూ. 60 లక్షలు అవుతుంది. 7.1 శాతం వడ్డీ రేటుతో చక్రవడ్డీతో కలిపి ఈ మొత్తం దాదాపు రూ. 1.33 కోట్లు అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా భార్యాభర్తలు లక్షాధికారులు కావచ్చు.
పీపీఎఫ్ పెట్టుబడి 'EEE' ట్యాక్స్ బెనిఫిట్(PPF tax free returns) సౌకర్యంతో వస్తుంది. పెట్టుబడి పన్ను రహితం , వడ్డీ పన్ను రహితం, మెచ్యూరిటీ మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్ అకౌంట్ 15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. కానీ మీరు దానిని 5 ఏళ్లు పొడిగించవచ్చు. మెచ్యూరిటీ తర్వాత ఒక సంవత్సరం లోపు ఫారం-H ని సమర్పించాలి. PPF అనేది పూర్తిగా ప్రభుత్వ హామీ(government savings scheme)తో కూడిన పథకం. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా డబ్బు నష్టపోయే ప్రమాదం లేదు. ఏటా వడ్డీ పెరుగుతుంది. వడ్డీ పెరిగే కొద్దీ, మీ డబ్బు పెరుగుతుంది. వివాహిత జంటలు సురక్షితమైన భవిష్యత్తును, పన్ను రహిత నిధిని నిర్మించుకోవడానికి ఇది ఉత్తమ మార్గమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి