Share News

Gold Rates on Nov 1: మళ్లీ గోల్డ్ రేట్స్‌‌కు రెక్కలు.. నేటి ధరలు ఇవీ

ABN , Publish Date - Nov 01 , 2025 | 07:57 AM

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates on Nov 1: మళ్లీ గోల్డ్ రేట్స్‌‌కు రెక్కలు.. నేటి ధరలు ఇవీ
Gold, Silver Prices on Nov 1

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లల్లో కోతలు ఉండవన్న అంచనాలు, కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో, సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట ప్రకారం, నేడు (శనివారం) ఉదయం 7 గంటలకు దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,290గా ఉంది. నిన్నటితో పోలిస్తే సుమారు రూ.వెయ్యి మేర పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగి రూ.1,13,010కు చేరుకుంది (Gold, Silver Rates on Nov 1).

పరిశ్రమల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,50,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ బంగారం స్పాట్ ధర 4,004 డాలర్లుగా ఉంది. ఎమ్‌సీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ (10 గ్రాములు) ఫ్యూచర్స్ ధరలు రూ.1.21 లక్షల వద్ద, కిలో వెండి ఫ్యూచర్స్ ధర రూ.1.48 లక్షల వద్దా తచ్చాడుతోంది.


బంగారం ధరలు ఇవీ (24కే, 22కే, 18కే)

  • చెన్నై: ₹1,23,270; ₹1,12,990; ₹94,190

  • ముంబై: ₹1,23,290; ₹1,13,010; ₹92,470

  • ఢిల్లీ: ₹1,23,440; ₹1,13,160; ₹92,620

  • కోల్‌కతా: ₹1,23,290; ₹1,13,010; ₹92,470

  • బెంగళూరు: ₹1,23,290; ₹1,13,010; ₹92,470

  • హైదరాబాద్: ₹1,23,290; ₹1,13,010; ₹92,470

  • విజయవాడ: ₹1,23,290; ₹1,13,010; ₹92,470

  • కేరళ: ₹1,23,290; ₹1,13,010; ₹92,470

  • పూణె: ₹1,23,290; ₹1,13,010; ₹92,470

  • వడోదరా: ₹1,23,340; ₹1,13,060; ₹92,520

  • అహ్మదాబాద్: ₹1,23,340; ₹1,13,060; ₹92,520

కిలో వెండి ధరలు

  • చెన్నై: ₹1,64,900

  • ముంబై: ₹1,50,900

  • ఢిల్లీ: ₹1,50,900

  • కోల్‌కతా: ₹1,50,900

  • బెంగళూరు: ₹1,50,900

  • హైదరాబాద్: ₹1,64,900

  • కేరళ: ₹1,64,900

  • పూణె: ₹1,50,900

  • వడోదరా: ₹1,50,900

  • అహ్మదాబాద్: ₹1,50,900

  • విజయవాడ: ₹1,64,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఇవీ చదవండి:

అలర్ట్.. నవంబర్‌లో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు

వేల కోట్ల విలువైన ఐపీవోల విడుదల.. ఎప్పుడంటే..?

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 08:17 AM