OpenAI to Set Up India Office: ఈ ఏడాదే భారత్‌లో ఓపెన్ ఏఐ కార్యాలయం
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:41 AM
ఈ ఏడాది చివరిలో ఢిల్లీలో తమ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఓపెన్ ఏఐ కంపెనీ తెలిపింది. ...
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో ఢిల్లీలో తమ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఓపెన్ ఏఐ కంపెనీ తెలిపింది. చాట్ జీపీటీ సహా ఏఐ ఆధారిత ఓపెన్ ఏఐ టూల్స్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్‌గా మారింది. దీంతో భారత్‌లోనూ కార్యాలయం ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కార్యాలయంలో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్టు వెల్లడించింది. తమ ఏఐ టూల్స్‌కు భారత్‌లో వేగంగా పెరుగుతున్న గిరాకీని తట్టుకునేందుకు ఈ కార్యాలయం తోడ్పడుతుందని ఓపెన్ ఏఐ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి