Share News

Key Financial Changes: డిసెంబర్‌ 1 నుంచి రానున్న 5 ప్రధాన మార్పులు ఇవే!

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:35 PM

రేపటితో నవంబర్ నెల ముగియనుంది. డిసెంబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక నిబంధనలకు సంబంధించి అనేక మార్పులు వచ్చే నెలలో అమల్లోకి రానున్నాయి.

Key Financial Changes: డిసెంబర్‌ 1 నుంచి రానున్న 5 ప్రధాన మార్పులు ఇవే!
November 30 financial deadlines

ఇంటర్నెట్ డెస్క్: రేపటితో నవంబర్ నెల ముగియనుంది. ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. నవంబర్ 30వ తేదీ(November 30 financial deadlines) లోపే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. కొత్త నెల ప్రారంభం కాగానే కొన్ని విషయాలలో నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి. డిసెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే ఆర్థిక నిబంధనల ప్రధాన మార్పులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


యూపీఎస్ (UPS)కి డెడ్‌లైన్ :

నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)లోకి మారేందుకు గడువు రేపటి(నవంబర్ 30)తో ముగియనుంది. ఈ గడువును మొదట సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. కానీ తరువాత నవంబర్ 30 వరకు పొడిగించారు. గడువు తేదీలోపే ఏ స్కీమ్‌(NPS, UPS deadline)లో చేరాలనుకుంటున్నామే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటంది. ఇంకో ఒక రోజే గడువు ఉంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) నుండి మారాలనుకునే వారు సీఆర్ఏ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలి. లేదా గడువుకు ముందే సంబంధిత నోడల్ అధికారులకు అవసరమైన పత్రాలను సమర్పించాలి.


పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ :

పెన్షనర్లందరూ నవంబర్ 30వ తేదీలోపు తమ వార్షిక లైఫ్ సర్టిఫికేట్(pension life certificate) సమర్పించాలి. పెన్షనర్ బతికే ఉన్నారో లేదో ప్రభుత్వం ధృవీకరించుకునేందుకు ఈ సర్టిఫికేట్ వీలు కల్పిస్తుంది. చాలా మంది ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఉపయోగిస్తున్నారు. దీనిని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కూడా సమర్పించవచ్చు. సకాలంలో ధృవీకరణ పత్రం సమర్పించకపోతే మళ్ళీ సర్టిఫికేట్ సమర్పించే వరకు పెన్షన్ నిలిచిపోతుంది.


TDS స్టేట్‌మెంట్‌ ఫైలింగ్:

నవంబర్ 30 తేదీ నాటికి పన్ను చెల్లింపుదారులు టీడీఎస్(TDS filing deadline) వివరాలను దాఖలు చేయాలి. ఇందులో అక్టోబర్‌లో చేసిన TDS స్టేట్‌మెంట్‌లు, సెక్షన్ 194-IA, సెక్షన్ 194-IB, సెక్షన్ 194M, సెక్షన్ 194S వంటివి ఇందులో ఉన్నాయి. సెక్షన్ 92E కింద ట్రాన్స్‌ఫర్ ధరల రిపోర్టులను దాఖలు చేయాల్సిన కంపెనీలు కూడా నవంబర్ 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. నవంబర్ 30వ తేదీ నాటికి ఫారమ్ 3CEAAను సమర్పించాలి. ఈ గడువులను దాటితే ఆదాయపు పన్ను శాఖ నుండి జరిమానాలు లేదా నోటీసులు రావచ్చు.


LPG గ్యాస్ సిలిండర్ల రేట్లలో మార్పులు :

వచ్చే నెల(డిసెంబర్ 1)లో చమురు కంపెనీలు కొత్త ఎల్పీజీ సిలిండర్ ధరలను విడుదల చేస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ రేట్ల ఆధారంగా ధరలు నెలవారీగా సవరిస్తారు. గత ఏడాదిలో కమర్షియల్ సిలిండర్ ధరలు కొద్దిగా తగ్గాయి. డిసెంబర్ 1న దేశీయ గ్యాస్ చౌకగా మారుతుందా లేదా ఖరీదైనదిగా మారుతుందా? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విమాన ఇంధన (ATF) ధరలు :

ప్రతి నెలా మొదటి తేదీన ATF (ఏవియేషన్ టర్బైన్ ఇంధనం) ధర కూడా సవరిస్తుంటుంది. అలానే వచ్చే నెలలో కూడా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు(ATF fuel price changes) మారుతాయి. ఈ ఇంధన ధరల పెంపు లేదా తగ్గింపు విమానయాన సంస్థల ఖర్చులపై ప్రభావితం చేస్తుంది. దాంతో విమాన ఛార్జీలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇది చౌకగా మారితే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించవచ్చు.


ఇవీ చదవండి:

విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2025 | 05:01 PM