Share News

Stock Market: స్టాక్ మార్కెట్లో బిగ్ లాస్.. గంటల్లోనే రూ. 349 లక్షల కోట్లు ఖతం..

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:27 AM

ఇటీవల గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు సంభవించగా, ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లో కూడా బిగ్ లాస్ వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రే కొన్ని గంటల వ్యవధిలోనే రూ. 349 లక్షల కోట్ల సంపద తగ్గిపోయింది.

Stock Market: స్టాక్ మార్కెట్లో బిగ్ లాస్.. గంటల్లోనే రూ. 349 లక్షల కోట్లు ఖతం..
Stock Market rs3.49 Trillion Loss

అమెరికా స్టాక్ మార్కెట్లు (US Stock Market) ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి. దీంతో మార్చి 10న రాత్రి ప్రధాన సూచీలైన నాస్‌డాక్, S&P 500 వరుసగా 4 శాతం, 2.70 శాతం పడిపోయాయి. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య యుద్ధం వస్తుందని భయాందోళనలు మొదలయ్యాయి.

దీంతో ఆర్థిక మందగమనం వస్తుందని భావించిన పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో S&P 500 గరిష్ట స్థాయి నుంచి ఏకంగా $4 ట్రిలియన్ల (రూ. 349 లక్షల కోట్లు)ను కోల్పోయింది. 2022 తర్వాత అమెరికాలోని టెక్నాలజీ స్టాక్‌లు అత్యంత పెద్ద ఇంట్రాడే నష్టాలను చవిచూడటం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అమ్మకాలు కేవలం ఈక్విటీలు మాత్రమే కాకుండా, కార్పొరేట్ బాండ్‌లు, US డాలర్, క్రిప్టోకరెన్సీ సహా అనేక ఇతర అంశాలపై కూడా ప్రభావితం చూపించాయి.


కారణాలివేనా..

మరోవైపు అమెరికా బాండ్ ధరలు కూడా పడిపోయాయి. ట్రంప్ సుంకాల నిర్ణయాలు ఆర్థిక పరిణామాలపై ఆందోళనలు సృష్టిస్తున్నాయి. కెనడా, మెక్సికో, చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించాయి. అలాగే భారతదేశంపై కూడా సుంకాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ చర్యలు ప్రధానంగా వ్యాపారులు, పెట్టుబడిదారులకు అనిశ్చితిని పెంచాయి. ట్రంప్ సుంకాల విధానాలు, ఖర్చు కోతలు అమెరికా ఆర్థిక వ్యవస్థను నెమ్మదింపజేస్తాయని, మాంద్యం ప్రమాదాన్ని పెంచుతాయనే భయాలు నెలకొన్నాయి. దీంతో మదుపర్లు అమ్మకాల వైపు ఆసక్తి చూపారు. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


పతనానికి ఈ కారణాలు కూడా..

దీంతోపాటు ఇటీవల US స్థూల ఆర్థిక డేటా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గురించి మిశ్రమ సంకేతాలను ఇచ్చింది. గత శుక్రవారం విడుదలైన ఉద్యోగాల నివేదిక ఫిబ్రవరిలో పలు కంపెనీలు 1,51,000 ఉద్యోగాలను నియమించుకున్నాయని తెలిపింది. అంతేకాదు US ఫెడ్ ద్వారా మరిన్ని రేట్ల కోతల అంచనాలు కూడా తగ్గాయి. ఇంతకు ముందు ట్రంప్ విధానాల నుంచి ఉత్పన్నమయ్యే విస్తృత అనిశ్చితి కోసం వేచి ఉన్నందున, రాబోయే నెలల్లో సెంట్రల్ బ్యాంక్ తన బెంచ్‌మార్క్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచే అవకాశం ఉందని US ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. మొత్తంగా చెప్పాలంటే ట్రంప్ విధానాలపై ఆందోళనలు, ఆర్థిక మందగమనం, US ఫెడ్ రేటు కోతల అంచనాలు తగ్గడం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

Elon Musk: సోషల్ మీడియా Xలో అంతరాయం.. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిందన్న ఎలాన్ మస్క్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 11 , 2025 | 11:52 AM