Today gold and silver rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..
ABN , Publish Date - Jan 22 , 2025 | 07:05 AM
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం (22-01-2025) ఉదయం 06:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.74,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.10 తగ్గి రూ.81,370గా ఉంది.
బిజినెస్ డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం (22-01-2025) ఉదయం 06:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.74,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.10 తగ్గి రూ.81,370గా ఉంది. అదే విధంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో గ్రాముకు రూపాయి చొప్పున తగ్గి 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.74,490 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గ్రాముకు రూపాయి చొప్పున తగ్గి రూ.81,220గా ఉంది.
వెండి ధరలు ఇవి..
ఇక వెండి విషయానికి వస్తే స్వల్ప ఊరట లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రూ.96,500 ఉన్న ధర కిలోకు రూ.100 తగ్గి రూ.96,400 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీకి రూ.100 తగ్గి రూ.1,03,900కు చేరింది.
ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇవే..
ముంబై- రూ.74,490, రూ.81,220
కోల్‌కతా- రూ.74,490, రూ.₹81,220
హైదరాబాద్- రూ.74,490 రూ.81,220
విజయవాడ- రూ.74,490 రూ.81,220
ఢిల్లీ- రూ.74,640 రూ.81,370
బెంగళూరు- రూ.₹74,490, రూ.₹81,220
భవనేశ్వర్- రూ.74,490, రూ.81,220
చెన్నై- రూ.74,490, రూ.81,220
జైపూర్-రూ.74,640, రూ.81,370