Sbi Har Ghar Lakhpati: ప్రతి నెలా రూ. 591 ఇన్వెస్ట్ చేయండి .. మిలియనీర్ అవ్వండి..
ABN , Publish Date - Jan 06 , 2025 | 09:41 PM
చిన్న మొత్తాల పొదుపులను ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రికరింగ్ డిపాజిట్ (RD) పథకాన్ని ప్రారంభించింది. అదే 'హర్ ఘర్ లఖపతి' (ప్రతి ఇంట్లో లఖపతి). ఈ పథకం కింద మీరు ప్రతి నెలా చిన్న మొత్తాలను డిపాజిట్ చేయడం ద్వారా లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు.

చిన్న పొదుపులు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'హర్ ఘర్ లఖపతి' అనే కొత్త రికరింగ్ డిపాజిట్ (RD) పథకాన్ని (Har Ghar Lakhpati) ప్రారంభించింది. దీనిలో మీరు చిన్న నెలవారీ పొదుపుల చేసుకోవడం ద్వారా 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ కార్పస్ మొత్తాన్ని పొందవచ్చు. అయితే ఈ స్కీంలో ఎంత పెట్టుబడి చేయాలి, ఎలా తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ పథకం ముఖ్య లక్షణాలు
ఈ పథకం కింద కస్టమర్లు 3 నుంచి 10 సంవత్సరాల వరకు నెలవారీ చిన్న మొత్తాలను పెట్టుబడి చేసుకోవచ్చు
అర్హత: 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు, పెద్దలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులు చట్టపరమైన సంరక్షకుడితో ఖాతాను తెరవవచ్చు
ఈ పథకం ఎలా పని చేస్తుంది?
ఈ పథకం కింద మెచ్యూరిటీ మొత్తం రూ. 1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది. కస్టమర్‌లు తమ ప్రాధాన్య వ్యవధి, EMIని ఎంచుకునే దాన్ని బట్టి మారుతుంది.
కస్టమర్ 3 సంవత్సరాల పాటు నెలకు రూ. 2,500 ఆదా చేస్తే వారు మెచ్యూరిటీపై రూ. 1 లక్ష మొత్తాన్ని అందుకుంటారు.
కస్టమర్ 10 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుంటే, నెలవారీ పొదుపు మొత్తం రూ. 591కి తగ్గుతుంది
ఖాతా తెరిచే సమయంలో వర్తించే వడ్డీ రేట్ల ఆధారంగా నెలవారీ వాయిదా లెక్కించబడుతుంది
వడ్డీ రేట్లు, పన్ను నియమాలు
కస్టమర్ ఎంచుకున్న కాలాన్ని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
సాధారణ ప్రజలకు : గరిష్టంగా 6.75% వడ్డీ
సీనియర్ సిటిజన్లకు: గరిష్టంగా 7.25% వడ్డీ
SBI ఉద్యోగులు, సీనియర్ సిటిజన్ ఉద్యోగులకు: గరిష్టంగా 8% వడ్డీ
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు (TDS) వర్తిస్తుంది
పెనాల్టీ ఎలా ఉంటుంది..?
ఈ పథకం పాక్షిక వాయిదాల చెల్లింపు సౌకర్యంతో సహా సౌలభ్యాన్ని అందిస్తుంది
వాయిదాను డిపాజిట్ చేయడంలో జాప్యం జరిగితే కాలవ్యవధిని బట్టి రూ. 100కి రూ.1.50 నుంచి రూ. 2 వరకు జరిమానా విధించబడుతుంది
వరుసగా 6 నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే మీ ఖాతా మూసివేయబడుతుంది. బ్యాలెన్స్ లింక్ చేయబడిన సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది
ఖాతా తెరవడం ఎలా?
ఈ పథకంలో చేరడానికి కస్టమర్ సమీపంలోని SBI శాఖను సందర్శించి అవసరమైన పత్రాలను సమర్పించాలి
ఖాతాను తెరిచే సమయంలో కస్టమర్ తప్పనిసరిగా మెచ్యూరిటీ మొత్తాన్ని, EMIని లెక్కించగల కాలవ్యవధిని పేర్కొనాలి
SBI 'హర్ ఘర్ లఖపతి' పథకం చిన్న పెట్టుబడుల ద్వారా పెద్ద కార్పస్‌ను నిర్మించుకోవడానికి సులభమైన, సురక్షితమైన మార్గమని చెప్పవచ్చు. దీనిలో మీరు క్రమశిక్షణతో చేసిన పొదుపు మీ ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడుతుంది.
గమనిక: ఆంధ్రజ్యోతి ఎలాంటి పథకాలలో పెట్టుబడి చేయాలని సలహా ఇవ్వదు, సమాచారం మాత్రమే ఇస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
ఇవి కూడా చదవండి:
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News