Indias First Self Driving Auto: దేశంలో ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో..డ్రైవర్ లేకుండానే ప్రయాణం..
ABN , Publish Date - Sep 30 , 2025 | 08:24 PM
అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే డ్రైవర్ లెస్ వాహనాలు వీధుల్లో సంచరిస్తుండగా, ఇప్పుడు భారత్‌లోనూ ఈ సాంకేతికత అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే త్రీ-వీలర్ తయారీ సంస్థ ఒమేగా సీకి మొబిలిటీ (OSM) దేశంలో తొలి మానవ ప్రమేయం లేకుండా నడిచే ఆటోను ఆవిష్కరించింది.
ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో డ్రైవర్ లేకుండా స్మార్ట్ వాహనాలు వీధుల్లో పయనిస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ మన భారత్‌లోనూ అడుగుపెట్టింది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ తయారీ సంస్థ ఒమేగా సీకి మొబిలిటీ (OSM) దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా స్వయంగతి(Swayamgati)ని (Indias First Self Driving Auto) ఆవిష్కరించింది. దీనివల్ల భవిష్యత్తులో రవాణా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పూర్తిగా ఆటోమేటెడ్‌గా, ఎలాంటి మానవ జోక్యం లేకుండా పనిచేసే ఈ ఆటో, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్‌కు కొత్త అవకాశాలను అందించనుంది.
స్వయంగతి
స్వయంగతి అనేది ఒమేగా సీకి మొబిలిటీ అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. ఇది రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ప్యాసెంజర్ వెర్షన్, కార్గో వెర్షన్. ప్యాసెంజర్ వెర్షన్ ధర రూ. 4 లక్షలు (ఎక్స్-షోరూమ్), కార్గో వెర్షన్ ధర రూ. 4.15 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఆటో కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు వెంటనే ఆరంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.
శక్తివంతమైన బ్యాటరీ, రేంజ్
స్వయంగతి 10.3 kWh బ్యాటరీతో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ రేంజ్ నగరాల్లో రోజువారీ రవాణా అవసరాలకు అనువైనదిగా ఉంటుంది. స్వయంగతి AI ఆధారితంగా స్వయంగా నడిచే వ్యవస్థను కల్గి ఉంది. ఈ ఆటోలో లైడార్ టెక్నాలజీ, GPS, ఆరు మీటర్ల దూరం వరకు అడ్డంకులను గుర్తించే సామర్థ్యం, మల్టీ సెన్సార్ నావిగేషన్, రిమోట్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ సాంకేతికతల సమన్వయంతో, స్వయంగతి డ్రైవర్ లేకుండానే ముందుగా నిర్ణయించిన రూట్‌లలో సురక్షితంగా ప్రయాణించగలదు.
టెస్టుల్లో సక్సెస్
స్వయంగతి ఫేజ్ 1 ట్రయల్స్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఆటో ఏడు స్టాప్‌లతో 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రియల్-టైమ్ అడ్డంకుల గుర్తింపు, ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని చాటుకుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. స్వయంగతి ఆటోలు ప్రత్యేకంగా విమానాశ్రయాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, స్మార్ట్ సిటీ వంటి ప్రాంతాల్లో ఉపయోగించడానికి రూపొందించబడ్డాయని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి