IDBI Privatisation: IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ దిశగా మరో నిర్ణయం..LICకి కొత్త హోదా
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:23 PM
IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ SEBI, IDBI బ్యాంక్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాత్రపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ దిశగా మరో ముందడుగు పడింది. తాజాగా SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ని IDBI బ్యాంక్‌లో పబ్లిక్ షేర్‌హోల్డర్‌గా చేయడానికి కొన్ని షరతులతో ఓకే చెప్పింది. దీనికి ముందు 2021 మేలో కేంద్ర ప్రభుత్వం IDBI బ్యాంక్‌లో తన వాటాను విక్రయించేందుకు ఆమోదం తెలిపింది.
మరికొన్ని రోజుల్లో..
ఈ ప్రక్రియను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) నడిపిస్తోంది. ప్రభుత్వం (45.48%), LIC (49.24%) కలిసి IDBI బ్యాంక్‌లో దాదాపు 94.7% వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్‌కు ఈ వాటాను అమ్మాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ డీల్ పూర్తయితే, IDBI బ్యాంక్ పూర్తిగా ప్రైవేట్ బ్యాంక్‌గా మారనుంది.
SEBI షరతులు ఏంటి?
SEBI నుంచి పబ్లిక్ షేర్ హోల్డర్ హోదా పొందేందుకు LIC కొన్ని షరతులు పాటించాలి
LIC ఓటింగ్ హక్కులు 10%కి మించకూడదు
బ్యాంక్ ఆపరేషన్స్‌పై LICకి ఎలాంటి నియంత్రణ ఉండదు
LICకి బ్యాంక్ బోర్డ్‌లో నామినీ డైరెక్టర్ లేదా కీలక పాత్రల్లో ఉండదు
ఈ డీల్ గురించి ఓపెన్ ఆఫర్ లెటర్‌లో LIC తమ ఉద్దేశాన్ని స్పష్టం చేయాలి
RBI నిబంధనల ప్రకారం, ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకే బ్యాంక్‌లో 15% కంటే ఎక్కువ వాటా కలిగి ఉండకూడదు. కాబట్టి, LIC తన వాటాను రెండేళ్లలో తగ్గించాలి.
ఒప్పందం పూర్తయ్యాక, IDBI బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజీలను సంప్రదించి LIC రీక్లాసిఫికేషన్‌ని అమలు చేయాలి
ఈ షరతులలో ఏదైనా ఉల్లంఘించితే, SEBI ఆమోదం తక్షణమే రద్దవుతుంది
ఈ డీల్ ఎందుకు ముఖ్యం?
IDBI బ్యాంక్ ఒకప్పుడు దేశంలోని ప్రముఖ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్. కానీ ఇటీవలి సంవత్సరాల్లో అసెట్ క్వాలిటీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంది. 2019లో LIC ఈ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుని, కాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టర్‌లో తన పాత్రను తగ్గించుకుని, ప్రైవేట్ ఇన్వెస్టర్‌ను తీసుకొచ్చి బ్యాంక్ ఆపరేషన్స్, గవర్నెన్స్‌ను మెరుగుపరచాలని చూస్తోంది.
ఎవరు ఆసక్తి చూపిస్తున్నారు?
ఈ డీల్‌కు సంబంధించి ఫైర్‌ఫాక్స్, జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారికంగా బిడ్డర్స్ లిస్ట్‌ను విడుదల చేయలేదు. ఆగస్టు 22న శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి IDBI బ్యాంక్ షేర్ ధర రూ. 94.90 వద్ద ముగిసింది. గత వారంలో ఈ షేర్ ధర సుమారు 7.55% పెరిగింది. ఈ డీల్ గురించి వార్తలు మార్కెట్‌లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి