Personal Finance: నా జీతం రూ. 29,500, రూ. 9.4 లక్షల లోన్.. సిప్ ఎలా ప్లాన్ చేయాలి..
ABN , Publish Date - Jan 18 , 2025 | 07:50 PM
పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఎలాంటి దానినైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ కూడా జీతం తక్కువగా ఉందని మీ ఆర్థిక లక్ష్యాలను మరిచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. రూ. 29 వేల జీతం ఉన్నవారు కూడా సేవింగ్ చేయవచ్చని చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో పెట్టుబడులు రుణాల నిర్వహణ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలాగంటే మీ జీతం రూ. 29,500 ఉండి, మీరు 10% వడ్డీతో రూ. 9.4 లక్షల ఓవర్‌డ్రాఫ్ట్ (OD) లోన్ కల్గి ఉన్నప్పటికీ, మీరు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడులు చేయవచ్చు. అయితే అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
రుణ చెల్లింపుకు ప్రాధాన్యత ఇవ్వండి
మీకు ఉన్న OD లోన్ 10% వడ్డీ రేటుతో ఉండటం వల్ల, అది మీరు చేసే పెట్టుబడులకు మించి భారాన్ని ఉంచవచ్చు. కాబట్టి SIP ద్వారా పెట్టుబడులు ప్రారంభించే ముందు, మొదట రుణాన్ని త్వరగా చెల్లించడంపై దృష్టి పెట్టండి. ఆ క్రమంలో అధిక వడ్డీ రేటు ఉన్న రుణాలను తొలగించడం, దాని పై చెల్లించే మొత్తం వడ్డీని తగ్గిస్తుంది. ఈ క్రమంలో మీరు నెలకు రూ. 15,000 రుణం చెల్లించే విధంగా ప్లాన్ చేసుకోండి. దీంతోపాటు మీకు కుదిరిన సమయంలో ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని నెలకు రూ. 500 లేదా వెయ్యి నుంచి కూడా మీరు SIP విధానాన్ని మొదలుపెట్టవచ్చు.
మూడేళ్ల తర్వాత
ఆ క్రమంలో మీరు ఓ మూడేళ్లు రూ.15 వేల చొప్పున చెల్లిస్తే మీ రుణం దాదాపు సగానికిపైగా పూర్తవుతుంది. ఆ క్రమంలో మీరు మీ సిప్ చెల్లింపులను క్రమంగా పెంచుకోండి. మొదటి మూడేళ్ల తర్వాత మీ పొదుపును రూ. 5,000-7,000 మధ్య పరిమాణంలో SIPను చేయవచ్చు. ఇది చిన్న మొత్తంగా ప్రారంభించి రుణం పూర్తైన తరువాత దీనిని మరింత పెంచుకోవచ్చు. అంతేకాదు తర్వాత మీకు పెరిగిన ఆదాయం లేదా తగ్గిన ఖర్చులను బట్టి SIP మొత్తాన్ని రూ. 10,000-12,000 వరకు కూడా పెంచుకోవచ్చు. తద్వారా మీ పెట్టుబడులను మరింత విస్తరించుకోవచ్చు. దీని వల్ల మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి ప్రగతిని సాధించి పెద్ద మొత్తాన్ని పొందుతారు.
SIP పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేయడం
అయితే SIPలో పెట్టుబడులు పెట్టేటప్పుడు, వివిధ రకాల ఫండ్లలో పెట్టుబడిని విభజించడం అవసరం. దీని ద్వారా పెట్టుబడుల రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. ఈక్విటీ ఫండ్లు అధిక వృద్ధి అవకాశాలను అందిస్తాయి. కానీ అవి కొంత రిస్క్‌ను కలిగిస్తాయి. కనుక SIP పోర్ట్‌ఫోలియోలో లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ వాటి కేటాయింపు ప్రణాళికను సమతుల్యం చేసుకోవాలి. మీరు రుణ చెల్లింపులు, SIP పెట్టుబడులకు సరైన నగదు ప్రవాహం చేసుకోవడానికి లోన్ పూర్తయ్యే వరకు అనవసర ఖర్చులను క్రమంగా తగ్గించుకోవడం అవసరం. అనవసరమైన ఖర్చులను తగ్గించి, అత్యవసర నిధి రూపొందించుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News