Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా అప్లై చేయాలి? KYC అప్‌డేట్ కోసం ఏం చేయాలి?
ABN , Publish Date - May 30 , 2025 | 02:01 PM
Kisan Credit Card Apply Online: అన్నదాతల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం క్రెడిట్ కార్డు (KCC) పథకం ప్రవేశపెట్టింది. రైతులు మాత్రమే కాకుండా మత్స్య సంపద, పశు సంవర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి, కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇదివరకే కార్డు ఉన్నవారు e-KYC అప్‌డేట్ కోసం ఏం చేయాలి?
Kisan Credit Card KYC Update Process: రైతుల సాగు అవసరాలు తీర్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డు ద్వారా వ్యవసాయదారులు అతి తక్కువ వడ్డీకి వేగంగా సాగు ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్, పంట కోసం రుణాలు సహా వివిధ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, అవగాహన లేమి కారణంగా చాలామంది అర్హత కలిగిన రైతులు కార్డును అందుకోలేక పోతున్నారు. ఇంతకీ, కిసాన్ కార్డు కోసం ఆన్ లైన్ ద్వారా ఎలా ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇదివరకే కార్డు ఉన్నవారు e-KYC అప్‌డేట్ కోసం ఏం చేయాలి? ఈ పథకానికి ఎవరెవరు అర్హులు? తదితర పూర్తి వివరాలు..
కిసాన్ క్రెడిట్ కార్డు పథకం 1998లో రైతులకు క్రెడిట్ సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్డుల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ అవసరాలకు డబ్బును పొందవచ్చు. సాగుదారులు, లీజుదారులు, కౌలు రైతులు, వాటా పంటదారులు, ఉమ్మడి వ్యవసాయ రైతులు (JLGలు), స్వయం సహాయక బృందాలతో పాటు (SHGలు) మత్స్య సంపద, పశు సంవర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు. కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్ఠంగా 75 ఏళ్లు ఉండాలి.
కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు ఎలా చేయాలి?
కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి స్థానిక బ్యాంకు లేదా పీఎం కిసాన్ యోజన(pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) కోసం దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫారమ్‌ను మీ వివరాలతో పాటుగా సాగు భూమి పత్రాలు, పంట వివరాలు, అవసరమైన సమాచారం నింపాల్సి ఉంటుంది.
ఇతర బ్యాంకు నుంచి కిసాన్ క్రెడిట్ కార్డును పొందలేదనే సమాచారం ఇవ్వాలి.
ఆధార్ కార్డు, పాన్ కార్డు, భూమి పత్రాలు వంటి కేవైసీ పత్రాలను దరఖాస్తు ఫారమ్‌తో జతపరచండి.
ఓటరు కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదో ఒకటి చిరునామాగా జత చేయాలి.
కేవైసీను ఏదైనా సహకార బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ) నుంచి పొందవచ్చు.
కార్డును ఎస్బీఐ, బీఓఐ, ఐడీబీఐ బ్యాంకు నుంచి కూడా తీసుకోవచ్చు.
దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రుపే కిసాన్ క్రెడిట్ కార్డు జారీ చేస్తుంది.
సేవింగ్స్ బ్యాంకు రేటుతో కేసీసీ కిసాన్ కార్డు ఖాతాలోని రుణంపై వడ్డీ చెల్లించబడుతుంది.
కేసీసీ కార్డు హోల్డర్లకు ఉచితంగా ఏటీఎం, డెబిట్ కార్డ్ అందిస్తారు.
కిసాన్ క్రెడిట్ కార్డులో 3 లక్షల రూపాయల వరకు రుణాలను ఇస్తారు. సంవత్సరానికి 2 శాతం చొప్పున వడ్డీ తగ్గుతూ వస్తుంది.
రుణాన్ని తిరిగి చెల్లించడానికి సంవత్సరానికి 3 శాతం చొప్పున అదనపు వడ్డీ లభిస్తుంది. కేసీసీ రుణాలపై పంటల బీమా సౌకర్యం లభిస్తుంది.
వ్యవసాయ వ్యయం, పంట కోత ఖర్చులు, భూమి ఖర్చుల ఆధారంగా మొదటి ఏడాదికి రుణం మొత్తం నిర్ణయిస్తారు.
కేవైసీ ఎలా అప్‌డేట్ చేయాలి?
PM-కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
'ఫార్మర్స్ కార్నర్'కి నావిగేట్ చేసి, 'e-KYC' చిహ్నంపై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. అనంతరం ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
OTP వచ్చాక దాన్ని నమోదు చేయండి.
(లేదా)
CSC PM KCC పోర్టల్‌కు వెళ్లండి.
మీ CSC ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
'స్టేటస్ చెక్' ఆప్షన్ ఎంచుకోండి.
మీ కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ID ని నమోదు చేయండి.
ఈ ప్రక్రియ ద్వారా మీ KYC స్థితిని తనిఖీ చేయవచ్చు.
ఇవీ చదవండి:
నెలకు రూ.25000 జీతం వచ్చినా పర్లేదు.. ఇందులో సేవ్ చేస్తే కొన్నేళ్లలోనే రూ.2.73 కోట్ల పైన రిటర్న్స్?
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి