GST Council Meeting: వచ్చేనెల 3 4 తేదీల్లో జీఎ్‌సటీ మండలి భేటీ
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:39 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎ్‌సటీ మండలి వచ్చే నెల 3 4 తేదీల్లో సమావేశం కానుంది..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎ్‌సటీ మండలి వచ్చే నెల 3-4 తేదీల్లో సమావేశం కానుంది. రేట్ల హేతుబద్ధీకరణ, పరిహార సుంకం, బీమాపై ఏర్పాటైన మంత్రుల బృందాల సిఫారసులపై ఈ సమావేశంలో జీఎ్‌సటీ మండలి చర్చించనుంది. కేంద్రం ఆర్థిక మంత్రితోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ మండలిలో సభ్యులుగా ఉన్నారు. జీఎ్‌సటీ మలి తరం సంస్కరణల్లో భాగంగా దీపావళి నాటికి పన్ను రేట్లను హేతుబద్ధీకరించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీఎ్‌సటీలో 5, 12, 18, 28 శాతం శ్లాబులున్నాయి. వాటిని 5, 18 శాతం శ్లాబులకు కుదించి.. పొగాకు, ఆల్కహాల్ వంటి 5-7 రకాల ఉత్పత్తులపైన మాత్రం 40 శాతం ప్రత్యేక రేటును విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే, వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను జీఎ్‌సటీ నుంచి పూర్తిగా మినహాయించాలని కూడా మోదీ సర్కారు ప్రతిపాదించింది. ప్రస్తుతం బీమా పాలసీలపై జీఎ్‌సటీ రేటు 18 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి