Gold and Silver Prices Today: షాకింగ్.. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధరలు..
ABN , Publish Date - Mar 05 , 2025 | 07:50 AM
Gold and Silver Prices Today: బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. బుధవారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై సంచలన ప్రకటన చేయడంతో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

బిజినెస్ డెస్క్: పసిడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. ఇవాళ (05-03-2025) పసిడి ధర మళ్లీ పెరిగింది. ఇప్పటికే కొండెక్కిన ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాగా, https://bullions.co.in/ ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,100కు పెరిగింది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,380 ధర పలికింది. మరికొన్ని రోజుల్లో ధర రూ.90 వేలకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వెండి ధర ఎంత పెరిగిందంటే ..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారంతో పాటుగా వెండి ధర కూడా భారీగా పెరిగింది. మార్చి 3 వరకు వరుసగా తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు నేడు కిలోపై ఒక్కసారిగా రూ.2000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 1,07,000కు చేరుకుంది.
బంగారం ధర పెరగడానికి కారణమిదే..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాతో సహా ఇతర దేశాలపై ట్రంపు భారీగా ఆంక్షలు విధిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నష్టాలు వస్తున్నాయని అంటున్నారు. స్టాక్ మార్కెట్లలో వస్తున్న నష్టాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని బంగారం వైపు తరలిస్తుండటంతో పసిడి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తయారీ, ఎగుమతుల ప్రోత్సాహానికి రెండు కొత్త కార్యక్రమాలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల స్మార్ట్ ఏసీల విక్రయం
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..