Share News

Gold and Silver Rates Today: రూ. 1850 పెరిగిన వెండి.. ఇక బంగారం విషయానికి వస్తే..

ABN , Publish Date - Jan 30 , 2025 | 06:24 AM

బంగారం, వెండి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో దేశంలో రెండో రోజు గోల్డ్ ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఈ రేట్లు ఏ మేరకు పెరిగాయి. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: రూ. 1850 పెరిగిన వెండి.. ఇక బంగారం విషయానికి వస్తే..
gold silver rates today january 30th 2025

మీరు ఈరోజు బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం (gold) ధరలు వరుసగా రెండో రోజు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 30, 2025న) ఉదయం 6.22 గంటల నాటికి https://bullions.co.in ప్రకారం గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 20 రూపాయలు పెరిగి రూ. 80,720కి చేరింది.

ఇదే సమయంలో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా రూ. 20 పెరిగి రూ. 80,430కి చేరుకోగా, ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,728కు చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 20 వృద్ధి చెంది రూ. 80,700కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 73,975 స్థాయిలో ఉంది.


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి (silver) ధరల విషయానికి వస్తే ఈరోజు ఉదయం నాటికి వెండి రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ. 1640 పెరిగి రూ. 91,850కి చేరుకోగా, హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర ఏకంగా రూ. 1850 వృద్ధి చెంది రూ. 92,150కి చేరుకుంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రేట్లు..

  • మణిపూర్‌లో బంగారం ధర రూ. 74,168, రూ. 80,910

  • చెన్నైలో బంగారం ధర రూ. 74,076, రూ. 80,810

  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,975, రూ. 80,700

  • విశాఖపట్నంలో బంగారం ధర రూ. 73,975, రూ. 80,700

  • బెంగళూరులో బంగారం ధర రూ. 73,920, రూ. 80,640

  • ముంబైలో బంగారం ధర రూ. 73,856, రూ. 80,570

  • కోటాలో బంగారం ధర రూ. 73,847, రూ. 80,560

  • కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,764, రూ. 80,470

  • ఢిల్లీలో బంగారం ధర రూ. 73,728, రూ. 80,430


బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా..

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24కి మించదు, క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే ముందు మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 06:36 AM