Gold prices: పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:48 PM
తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 17: అంతర్జాతీయంగా కీలక పరిణామాలు, దీపావళి పండుగ దృష్ట్యా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి.
అమెరికాలోని ప్రాంతీయ బ్యాంకులలో బలహీనత సంకేతాలు, ప్రపంచ వాణిజ్య ఘర్షణల నడుమ పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. దీనిపై ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంపద, సలహా విభాగమైన ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ తమ అంచనాలతో ఓ నివేదిక విడుదల చేసింది. తాజా పరిణామాల దృష్ట్యా వచ్చే ఏడాదిలో వెండి దాదాపు 20% పెరుగుదలను చూడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ధరలు ఔన్సుకు $60కి చేరుకుంటాయని పేర్కొంది. ఇందుకు పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, దాదాపు 20% నిరంతర సరఫరా లోటు కారణమని వివరించింద. దేశంలో ధంతేరాస్, దీపావళి పర్వదినం సందర్భంగా బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వారాంతం మొత్తం దీపావళి, ధంతేరాస్ (ధన త్రయోదశి) సందడి చేయండి. ధంతేరాస్‌కు ముందే పుత్తడి ధరలు చుక్కలు చూపించడంతో కొనుగోలుదారులు బంగారాన్ని ఎలా కొనాలని యోచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Dhanteras Puja: దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..
Diwali Bonus: రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్..