Share News

Gold Rates Dec 22: దడ పుట్టిస్తున్న పసిడి, వెండి.. ధరల్లో భారీ పెరుగుదల

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:58 PM

దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. వెనెజువెలా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ఫెడ్ రేటులో కొత తప్పదన్న అంచనాలు కలగలిసి ఒక్కసారిగా ధరలు పెరిగేలా చేశాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rates Dec 22: దడ పుట్టిస్తున్న పసిడి, వెండి.. ధరల్లో భారీ పెరుగుదల
Gold, Silver Rate Surge on Dec 22

ఇంటర్నెట్ డెస్క్: సోమవారం దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. యూఎస్ ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటులో కొత తప్పదన్న అంచనాలు బలపడటంతో పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,280కు చేరుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే రూ.1100 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.1000 మేర పెరిగి రూ.1,24,000కు చేరుకుంది. కొన్ని రోజులుగా అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న వెండి ధర నేడు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఏకంగా రూ.5 వేల మేర పెరిగి రూ.2,19,000కు చేరుకుంది (Gold, Silver Rates on Dec 22).

అంతర్జాతీయంగా కూడా పసిడి, వెండి ధరలు చుక్కలను అంటాయి. 24 క్యారెట్‌ల ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 4,383 డాలర్లను తాకింది. అక్టోబర్‌లో నమోదైన జీవితకాల గరిష్ఠం కంటే 1.5 శాతం మేర పెరిగింది. ఔన్స్ వెండి ధర కూడా 3.4 శాతం మేర పెరిగి 70 డాలర్లకు చేరువైంది. వెనెజువెలా చమురుపై అమెరికా ఆంక్షలతో పాటు డాలర్ బలహీనపడటం, ఫెడ్ రేట్‌లో కోతపై పెరిగిన అంచనాలతో బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని నిపుణులు చెబుతున్నారు.


ప్రధాన నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు

  • చెన్నై: ₹1,36,150; ₹1,24,800; ₹1,04,200

  • ముంబై: ₹1,35,280; ₹1,24,000; ₹1,01,460

  • న్యూఢిల్లీ: ₹1,35,430; ₹1,24,050; ₹1,01,610

  • కోల్‌కతా: ₹1,35,280; ₹1,24,000; ₹1,01,460

  • బెంగళూరు: ₹1,35,280; ₹1,24,000; ₹1,01,460

  • హైదరాబాద్: ₹1,35,280; ₹1,24,000; ₹1,01,460

  • విజయవాడ: ₹1,35,280; ₹1,24,000; ₹1,01,460

  • కేరళ: ₹1,35,280; ₹1,24,000; ₹1,01,460

  • పుణె: ₹1,35,280; ₹1,24,000; ₹1,01,460

  • వడోదరా: ₹1,35,330; ₹1,24,050; ₹1,01,510

  • అహ్మదాబాద్: ₹1,35,330; ₹1,24,050; ₹1,01,510

వెండి ధరలు ఇవీ

  • చెన్నై: ₹2,31,000

  • ముంబై: ₹2,19,000

  • న్యూఢిల్లీ: ₹2,19,000

  • కోల్‌కతా: ₹2,19,000

  • బెంగళూరు: ₹2,19,000

  • హైదరాబాద్: ₹2,31,000

  • విజయవాడ: ₹2,31,000

  • కేరళ: ₹2,31,000

  • పుణె: ₹2,19,000

  • వడోదరా: ₹2,19,000

  • అహ్మదాబాద్: ₹2,19,000


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.

ఇవీ చదవండి:

700 బిలియన్ డాలర్ల పైచిలుకు సంపద.. ఎలాన్ మస్క్ మరో రికార్డు

స్టాక్ మార్కెట్.. ఈ వారం కూడా ఆటుపోట్లలోనే!

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2025 | 01:51 PM