Stock market outlook: ఈ వారం కూడా ఆటుపోట్లలోనే!
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:24 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రేంజ్ బౌండ్‌లోనే చలించే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టమైన సంకేతాలేమీ రావటం లేదు. అనిశ్చితి కొనసాగుతూనే ఉంది....
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రేంజ్ బౌండ్‌లోనే చలించే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టమైన సంకేతాలేమీ రావటం లేదు. అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దీంతో నిఫ్టీ ప్రస్తుత రేంజ్‌లోనే కదలాడే వీలుంది. ప్రస్తుతం రియల్టీ, మీడియా, ఎనర్జీ, చమురు రంగాల షేర్లు మెరుగ్గా ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన స్టాక్స్‌ల్లోనే పెట్టుబడులు పెట్టడం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
బీఈఎల్: స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ షేరు ప్రస్తుతం నిలదొక్కుకుంటోంది. రిలేటివ్ స్ట్రెంత్ పర్వాలేదు. మూమెంటమ్ వస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.392.85 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.390 శ్రేణిలో ప్రవేశించి రూ.430 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.382 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టీవీఎస్ మోటార్: ప్రస్తుతం ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేటెడ్ అవుతోంది. నిఫ్టీతో పోలిస్తే జోరును ప్రదర్శిస్తోంది. మంచి రిలేటివ్ స్ట్రెంత్‌తో దూసుకు వెళుతోంది. కప్ అండ్ సాసర్ ప్యాటర్న్ కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.3,666 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.3,600 శ్రేణిలో ప్రవేశించి రూ.3,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.3,550 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
దీపక్ నైట్రేట్: ఏడాదిన్నర కాలంగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో చలిస్తోంది. గరిష్ఠ స్థాయి నుంచి 52 శాతం మేర పతనమైంది. రిలేటివ్ స్ట్రెంత్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. టర్న అరౌండ్‌కు అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,667 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌ల మదుపరులు రూ.1,660 స్థాయిలో ఎంటరై రూ.1,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1600 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
గుజరాత్ గ్యాస్ : గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ షేరు 45 శాతం మేర పతనమైంది. దీర్ఘకాలిక డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయికి చేరుకుంది. గత శుక్రవారం రూ.395.15 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.390 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.440 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.385 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కళ్యాణ్ జువెలర్స్: ఏడాది కాలంగా 45 శాతం మేర పతనమైన ఈ షేరు ప్రస్తుతం కీలకమైన రూ.480 మద్దతు స్థాయికి చేరుకుంది. ఒడుదొడుకలు తగ్గాయి. గత శుక్రవారం రూ.484.85 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.480 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.530 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.470 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.