Share News

Elon Musk : ఎగిరే కారును తెచ్చేస్తున్నా..

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:00 AM

ఎన్నో ఏళ్ల క్రితం రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ‘బామ్మ మాట బంగారు బాట’అనే సినిమా గుర్తుందా? ఆ సినిమాలో రకరకాల విన్యాసాలు చేస్తూ గాల్లో..

Elon Musk : ఎగిరే కారును తెచ్చేస్తున్నా..

  • ఈ ఏడాదిలోనే డెమో చూపిస్తా : ఎలాన్‌ మస్క్‌

న్యూఢిల్లీ, నవంబరు 1: ఎన్నో ఏళ్ల క్రితం రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ‘బామ్మ మాట బంగారు బాట’అనే సినిమా గుర్తుందా? ఆ సినిమాలో రకరకాల విన్యాసాలు చేస్తూ గాల్లోకి ఎగిరే సూపర్‌ కారు మన దగ్గర కూడా ఉంటే బాగుంటుందని అనుకుంటుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. గాల్లో ఎగిరే అలాంటి ఓ సూపర్‌ కారును మార్కెట్‌లోకి తీసుకువస్తున్నానంటూ టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ది జో రోగన్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనే పాడ్‌కా్‌స్టలో ఎగిరే కారు విషయాన్ని ఆయన వెల్లడించారు. 2014 నుంచి ఎగిరే కార్ల గురించి మాట్లాడుతున్న మస్క్‌.. తాము అభివృద్ధి చేస్తున్న ఎగిరే కారు ప్రొటోటై్‌పను ఈ ఏడాదిలోనే ప్రదర్శిస్తామని తాజా పాడ్‌కా్‌స్టలో ప్రకటించారు. టెస్లా నుంచి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్‌ సెకండ్‌ జనరేషన్‌ స్పోర్ట్స్‌ కారు గురించి పాడ్‌కాస్టర్‌ రోగన్‌ ప్రశ్నించగా.. మస్క్‌ ఎగిరే కారు గురించి మాట్లాడారు. టెస్లా తీసుకొచ్చే ఎగిరే కారుకు రెక్కలు ఉంటా యా?, హెలికాప్టర్‌లా గాల్లోకి ఎగిరే వీటీఓఎల్‌(వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌) వాహనమా? అని రోగన్‌ ప్రశ్నించగా.. మస్క్‌ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. కానీ, తమ ఆవిష్కరణ ఊహలకు అందని విధంగా ఉంటుందని, జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో బాండ్‌ ఉపయోగించిన కార్లన్నింటినిలోని ఫీచర్లను ఒకచోటుకు చేరేస్తే ఎలా ఉంటుందో అంతకుమించి ఉంటుందని చెప్పారు. అయితే, ఈ ఎగిరే కారుకు మించిన ఎన్నో అద్భుత ఆవిష్కరణలను మస్క్‌ గతంలోనూ ప్రకటించారు. వాటిని ప్రపంచానికి పరిచయం చేయడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ ఎగిరే కారును మస్క్‌ ఈ ఏడాదిలో చూపిస్తారో లేదో చూడాలి మరి.

Updated Date - Nov 02 , 2025 | 04:00 AM