Gold Rates on Dec 14: తగ్గేదేలేదంటున్న బంగారం ధరలు.. వినియోగదారులకు చుక్కలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:45 AM
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, సరఫరాలో కొరత వంటి పరిస్థితులు బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. మరి నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తుండటంతో దేశంలో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,910కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,22,750కు చేరింది. సరఫరా కొరత కారణంగా వెండి ధరలూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.1,98,000 వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates on Dec 14).
విలువైన లోహాల ధరల్లో పెరుగుదల.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మౌలిక మార్పులను సూచిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని సీజనల్ పెరుగుదలగా, లేదా స్థానిక డిమాండ్‌లో హెచ్చుతగ్గుల పర్యవసానంగా చూడలేమని అంటున్నారు. దీంతో సామాన్యులకు బంగారం ధరలు అందుబాటులో లేకుండా పోవడంపై ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచదేశాల మధ్య వాణిజ్యంలో మార్పులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై అనిశ్చితి, ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా పసిడి కొనుగోళ్లకు దిగడం వంటి పరిణామాలతో బంగారం ధరలు గత 40 ఏళ్లల్లో ఎన్నడూ చూడని స్థాయిలను చేరుకుంటున్నాయి. ధరలు మునుపటి స్థాయికి దిగొచ్చే అవకాశాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,34,950; ₹1,23,700; ₹1,03,300
ముంబై: ₹1,33,910; ₹1,22,750; ₹1,00,430
న్యూఢిల్లీ: ₹1,34,070; ₹1,22,900; ₹1,00,580
కోల్‌కతా: ₹1,33,910; ₹1,22,750; ₹1,00,430
బెంగళూరు: ₹1,33,910; ₹1,22,750; ₹1,00,430
హైదరాబాద్: ₹1,33,910; ₹1,22,750; ₹1,00,430
విజయవాడ: ₹1,33,910; ₹1,22,750; ₹1,00,430
కేరళ: ₹1,33,910; ₹1,22,750; ₹1,00,430
పుణె: ₹1,33,910; ₹1,22,750; ₹1,00,430
వడోదరా: ₹1,33,970; ₹1,22,800; ₹1,00,480
అహ్మదాబాద్: ₹1,33,970; ₹1,22,800; ₹1,00,480
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹2,10,000
ముంబై: ₹1,98,000
న్యూఢిల్లీ: ₹1,98,000
కోల్‌కతా: ₹1,98,000
బెంగళూరు: ₹1,98,000
హైదరాబాద్: ₹2,10,000
విజయవాడ: ₹2,10,000
కేరళ: ₹2,10,000
పుణె: ₹1,98,000
వడోదరా: ₹1,98,000
అహ్మదాబాద్: ₹1,98,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
భారత మార్కెట్లోకి ఒజెంపిక్ ఇంజక్షన్
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి