Ozempic Injection: భారత మార్కెట్లోకి ఒజెంపిక్ ఇంజక్షన్
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:46 AM
డెన్మార్క్ కేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ భారత మార్కెట్లోకి మరో బ్లాక్‌బస్టర్ ఔషఽధం ‘ఒజెంపిక్’ను విడుదల చేసింది....
ఙమధుమేహ చికిత్స కోసం నోవో నార్డిస్క్ ఔషధం
ధర రూ.8,800 - రూ.11,175
న్యూఢిల్లీ: డెన్మార్క్ కేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ భారత మార్కెట్లోకి మరో బ్లాక్‌బస్టర్ ఔషఽధం ‘ఒజెంపిక్’ను విడుదల చేసింది. ఈ ఔషధాన్ని టైప్ 2 డయాబెటి్‌సతో పాటు ఊబకాయ నియంత్రణ కోసం ఉపయోగించనున్నారు. ఇన్సులిన్ పెన్ రూపంలో విడుదల చేసిన ఈ ఒజెంపిక్ ఇంజక్షన్లు 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ డోసేజీల్లో లభిస్తాయి. టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లు డాక్టర్ల సిఫారసుపై వారానికి ఒకసారి ఈ ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారానికి ఒకసారి చొప్పున నెలకు నాలుగు సార్లు ఉపయోగించాల్సిన 0.25 ఎంజీ డోసేజీ ఇంజక్షన్ ధర రూ.8,800 వరకు ఉంది. ఇక 0.5 ఎంజీ సామర్థ్యంతో కూడిన నాలుగు ఇంజక్షన్స్ ధర రూ.10,170, 1ఎంజీ డోసేజీ ధర రూ.11,175 చొప్పున నిర్ణయించింది.
అదే జెనరిక్: నోవా నార్డిస్క్ ఈ ఏడాది జూన్‌లో ‘వెగోవీ’ పేరుతో ఊబకాయ నియంత్రణ ఔషధాన్ని భారీ ధరతో విడుదల చేసిం ది. ఇప్పుడు విడుదల చేసిన ఒజెంపిక్, వెగోవీ తయారీలోనూ సెమాగ్లుటైడ్ అనే యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్ (ఏపీఐ) ప్రధాన ముడి పదార్ధంగా ఉంది. కాగా ఈ రెండు ఔషధాలపై నోవో నార్డి్‌స్కకు వచ్చే ఏడాది మార్చి వరకు పేటెంట్ హక్కులు ఉన్నాయి.