Share News

Ambani Laddu: అంబానీ లడ్డు కావాలా నాయనా.. ఒక్కసారి ట్రై చేయండి.. అసలు విషయం మీకే తెలుస్తుంది..

ABN , Publish Date - Nov 28 , 2024 | 05:24 PM

అంబానీ లడ్డూ.. ఈ పేరు వినగానే అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూ అనుకునేరు. సోషల్ మీడియాలో ఓ మహిళ 'అంబానీ లడ్డూ' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇప్పుడు అంబానీ లడ్డూ రెసిపీని చేసేందుకు తెగ ఇష్టపడుతున్నారు.

Ambani Laddu: అంబానీ లడ్డు కావాలా నాయనా.. ఒక్కసారి ట్రై చేయండి.. అసలు విషయం మీకే తెలుస్తుంది..
Ambani Laddu

Ambani Laddu: స్వీట్స్ లో లడ్డూ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. చాలా మంది లడ్డూలను లొట్టలేసుకుంటూ తింటారు. అయితే, లడ్డులో చాలా రకాలు ఉంటాయి. కానీ, 'అంబానీ లడ్డూ' మీరు ఎప్పుడైనా తిన్నారా? మీరు వ్యాపారవేత్త అంబానీ ప్రత్యేకంగా చేసిన లడ్డూ అనుకునేరు. ఓ మహిళ కొత్త లడ్డూ రెసిపీ ఇచ్చింది. దానికి అంబానీ లడ్డూ అని పేరు పెట్టింది. ఎక్కువ ఖర్చుతో చేసే లడ్డూ కాబట్టి ఆ లడ్డూకు ఇలా పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ లడ్డూలో వాడేవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వాడే డ్రై ఫ్రూట్స్ మనుషులకు ఎలాంటి పోషకాహార లోపాన్ని రాకుండా అడ్డుకుంటాయి. ఇషికా సాహు అనే మహిళ "అంబానీ లడ్డూ" అని ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతే, క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారి దాదాపు 34 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంబానీ లడ్డూను ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..


అంబానీ లడ్డుకు కావల్సిన పదార్థాలు..

బాదం పప్పులు - అరకప్పు

జీడిపప్పు - అరకప్పు

పిస్తాపప్పు - పావుకప్పు

సీడ్ లెస్ ఖర్జూరం - ఒక కప్పు

ఎండు అప్రికాట్లు - అర కప్పు

అంజీర్ - అర కప్పు

నువ్వులు - రెండు స్పూన్లు

అంబానీ లడ్డు తయారీ విధానం..

అంబానీ లడ్డూ తయారు చేయడానికి ముందుగా బాదం, జీడిపప్పు, పిస్తాలను ఒక పెద్ద గిన్నెలో తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ మూడు పదార్థాల మిశ్రమాన్ని ఒక ప్లేట్‌ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ లో నెయ్యి వేసి బాదం, జీడిపప్పును మీడియం మంట మీద సువాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత పిస్తా వేసి 2 నుంచి 3 నిమిషాలు పాటు వేయించాలి. తర్వాత ఖర్జూర,ఎండిన ఆప్రికాట్లు, అంజీర్ వేడి చేయాలి. సువాసన వచ్చేవరకు వేయించిన తర్వాత దానికి డ్రై ఫ్రూట్స్ మిక్సర్ వేయాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సులభంగా లడ్డూలను తయారు చేసి నువ్వుల పిండికి అద్ది పక్కన పెట్టుకోవాలి. కొద్ది సేపటి తర్వాత ఈ లడ్డూను తింటే అబ్బబ్బా అని అంటారు.

Updated Date - Nov 28 , 2024 | 06:08 PM