Gold Rates on Dec 29: బంగారం, వెండి ధరలు.. ఈ వారం సరికొత్త రికార్డులకు ఛాన్స్!
ABN , Publish Date - Dec 29 , 2025 | 06:48 AM
గత వారమంతా బంగారం, వెండి ధరలు దూసుకుపోయాయి. ఈ వారం కూడా ఇదే రీతిలో జోరు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: గత వారం అంతా బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగింది. సరికొత్త ఆల్ టైమ్ రికార్డులు నమోదయ్యాయి. ఈ వారం కూడా ధరలు ఇదే రీతిలో పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ధర రూ.1.50 లక్షల మార్కును దాటే ఛాన్స్ ఉందని అంటున్నారు. మంగళవారం జరగనున్న అమెరికా ఫెడ్ రేట్ సమావేశం ఫలితాలను అనుసరించి బంగారం, వెండి ధరల తీరు తెన్నులు మారనున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం (డిసెంబర్ 29) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,210గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440. ఇక కిలో వెండి ధర రూ.2,50,900 వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates on Dec 29).
అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారం బంగారం ధర 3.77 శాతం మేర పెరిగింది. ఔన్స్ 24 క్యారెట్ గోల్డ్ ధర 4,584 డాలర్ల వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది. ఈ వారం కూడా ఇదే జోరు కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక వెండి ధరలు ఏకంగా 14.4 శాతం మేర పెరిగి 79.70 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్ ప్రాముఖ్యత తగ్గుతుండటం, బలహీనపడటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండివైపు మళ్లుతున్నారు. వెండికి పారిశ్రామికంగా కూడా డిమాండ్ ఉండటంతో బంగారాన్ని మించిన లాభాలు కురిపిస్తోంది.
వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,41,810; ₹1,29,990; ₹1,08,490
ముంబై: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
న్యూఢిల్లీ: ₹1,41,360; ₹1,29,590; ₹1,06,060
కోల్‌కతా: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
బెంగళూరు: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
హైదరాబాద్: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
విజయవాడ: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
కేరళ: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
పుణె: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
వడోదరా: ₹1,41,260; ₹1,29,490; ₹1,05,960
అహ్మదాబాద్: ₹1,41,260; ₹1,29,490; ₹1,05,960
వెండి(కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,73,900
ముంబై: ₹2,50,900
న్యూఢిల్లీ: ₹2,50,900
కోల్‌కతా: ₹2,50,900
బెంగళూరు: ₹2,50,900
హైదరాబాద్: ₹2,73,900
విజయవాడ: ₹2,73,900
కేరళ: ₹2,73,900
పుణె: ₹2,50,900
వడోదరా: ₹2,50,900
అహ్మదాబాద్: ₹2,50,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, బంగారం కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి పరిశీలించగలరు.
ఇవీ చదవండి:
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
వెండి ధర.. వచ్చే ఏడాది 100 డాలర్ల మార్కును దాటనుందా?