Gold Rate: అక్షయ తృతీయ నాటికి గోల్డ్ ధర ఎంతంటే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:25 PM
బంగారం ధరలు మరోసారి మరోసారి గరిష్ట స్థాయిల్లోకి దూసుకెళ్లాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆదివారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3 వేల 327 డాలర్ల వద్ద ఉండగా.. ఇప్పుడు అది భారీగా పెరిగి 3 వేల 380 డాలర్లపైకి చేరింది.. రాత్రికి రాత్రే ఇలా సీన్ రివర్స్ అయిపోయింది. ఎవరూ ఊహించని స్థాయిలో ధర పెరిగింది.
Gold Rate: బంగారం (Gold) కొనాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పసిడి ధరలు రికార్డు స్థాయి (Record High)లో పెరుగుతూ.. రోజు రోజుకు సరికొత్త గరిష్టస్థాయిని తాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం మళ్లీ ఆల్ టైమ్ గరిష్టా స్థాయికి (All Time Record) చేరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలు భారీగా పెంచుతున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇన్వెష్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ఇతర దేశాలపైన దుగుమతి సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఇదే సమయంలో చైనాపై సుంకాలను మరింత పెంచుతూ ఏకంగా 245 శాతానికి చేర్చారు. ఇదే వాణిజ్య యుద్ధ భయాలకు కారణమైంది. దీంతో పెట్ఠుబడిదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
Also Read..: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
ఈ క్రమంలోనే బంగారం ధరలు మరోసారి రి గరిష్ట స్థాయిల్లోకి దూసుకెళ్లాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆదివారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3 వేల 327 డాలర్ల వద్ద ఉండగా.. ఇప్పుడు అది భారీగా పెరిగి 3 వేల 380 డాలర్లపైకి చేరింది.. రాత్రికి రాత్రే ఇలా సీన్ రివర్స్ అయిపోయింది. ఎవరూ ఊహించని స్థాయిలో ధర పెరిగింది. ఉదయం 10 గంటల తర్వాత ఈ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్లో కనిపిస్తోంది.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 98 వేల 550 గా ఉంది.. 30వ తేదీన అక్షయ తృతీయ నాటికి బంగారం ధర లక్ష చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు వింటేనే హడలిపోయే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. సామాన్య, మధ్య తరగతివారే కాదు.. ఉన్నతి వర్గాల వారూ సయితం గోల్డ్ కొనలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో అమ్మకాలు లేక జ్యూయలరీ షాపుల యజమానులు, పనులు లేక స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 98,400కు చేరుకుని ఆల్ టైమ్ హైకు చేరి రికార్డు సృష్టించింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 90వేల 40కు చేరింది. మరోవైపు గోల్డ్ ధరలు విపరీతంగా పెరగడంతో కొనేవరు కరువయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు
For More AP News and Telugu News