Gold Price Drop: మళ్లీ పడిపోయిన పసిడి..గరిష్టం నుంచి భారీగా తగ్గుదల..
ABN , Publish Date - May 15 , 2025 | 05:55 PM
దేశంలో పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ రోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టి అనేక మందిని ఆశ్చర్యపరిచాయి. అయితే వీటి ధరలు ఏ మేరకు తగ్గాయి, ఎంత తగ్గాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు (మే 15, 2025న) పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. ఈ ధరల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో తాజాగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.2130 తగ్గిపోగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1950 స్థాయిలో తగ్గింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.93,930 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.86,100గా ఉంది.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు
న్యూఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.94,080 కాగా, 22 క్యారెట్ బంగారం రేటు రూ. 86,250గా ఉంది.
ముంబై, చెన్నై, కొల్ కత్తా, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాల్లో 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.93,930 ఉండగా, 22 క్యారెట్ పసిడి రూ.86,100గా ఉంది.
నగరాలను బట్టి ఈ ధరలు కాస్త మారుతుంటాయి. కానీ ఇది సాధారణంగా మార్కెట్ డిమాండ్, పన్నులు, సరఫరా, ఇతర ఆర్థిక కారకాలపై ఆధారపడి ఉంటుంది.
వెండి ధరలు
ఇక వెండి ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. మే 15, 2025న ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.97,000గా ఉంది. ఇది గత 24 గంటలలో ఏ మార్పు లేకుండా ఉంది.
బంగారం, వెండి ధరల ప్రభావం
బంగారం, వెండి ధరలు భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపిస్తాయి. ఎలాగంటే ఈ ధరలు పెరిగితే లేదా తగ్గితే, దానికి సంబంధించిన చెల్లింపులలో మార్పులు వస్తాయి. బంగారంను అనేక మంది కూడా పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. దీంతో దీనికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. వెండి కూడా వినియోగంలో ప్రస్తుతం ప్రధాన వస్తువులలో ఒకటిగా మారింది. ప్రత్యేకంగా బంగారం ధరలు పెరిగితే అనేక మంది వెండి వైపు మొగ్గు చూపుతారు. వీటి కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగితే ధరలు, కొనుగోళ్ల విషయంలో కూడా మార్పులు వస్తాయి.
భవిష్యత్తులో బంగారం ధరలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు, దేశంలో బౌగోళిక, రాజకీయ పరిస్థితులు కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులు వీటి ధరలు పెరగవచ్చని పలువురు చెబుతుండగా, మరికొంత మంది మాత్రం తగ్గుతాయని అంటున్నారు. బంగారం, వెండి ధరలు పెరిగినా లేదా తగ్గినా పెట్టుబడిదారులు, వినియోగదారులు ఎప్పటికప్పుడూ మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించి కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. వివిధ ప్రాంతాలలో ఉన్న అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటారు.
Also Read:
Zero Tariff: అమెరికా వస్తువులపై భారత్ సున్నా టారిఫ్..ట్రంప్ సంచలన ప్రకటన
ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..
For More Andhra Pradesh News and Telugu News..