Gold and Silver Prices Today: స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..మీ నగరంలో రేట్లు ఇలా
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:37 AM
దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మార్కెట్ పరిస్థితులు వీటిని ప్రభావితం చేస్తాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయం నాటికి వీటి ధరల్లో స్పల్ప తగ్గుదల కనిపించింది.
దేశంలో బంగారం, వెండి ధరలు (Gold Rates) ఎల్లప్పుడూ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా ఉంటాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయం నాటికి వీటి ధరలు స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 22, 2025) ఉదయం 6:15 గంటల నాటికి, హైదరాబాద్, ముంబైలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.1,12,140కి చేరగా, 22 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,02,790కి చేరింది. మరోవైపు వెండి కిలో ధర హైదరాబాద్, కేరళలో రూ.100 తగ్గి రూ.1,34,900కు చేరుకుంది. ఇదే సమయంలో ఇతర నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి ధరల తాజా అప్డేట్
భారతదేశంలోని వివిధ నగరాల్లో గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం 24 క్యారెట్ బంగారం (10 గ్రాముల) ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.1,12,290, చెన్నైలో రూ.1,12,250, కోల్‌కతా, పూణేలో రూ.1,12,140, బెంగళూరు, వడోదరలో రూ.1,12,140. ఇక వెండి ధరల విషయానికొస్తే, బెంగళూరులో ఒక కిలోకు రూ.1,33,500గా ఉంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో రూ.1,44,900గా, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పూణే, వడోదరలో రూ.1,34,900గా ఉన్నాయి.
ఈ ధరలు నగరాలను బట్టి మారుతున్నాయి. బంగారం ధరలు ఢిల్లీలో అత్యధికంగా, కోల్‌కతా, పూణే, బెంగళూరు, వడోదరలో కొంచెం తక్కువగా ఉన్నాయి. వెండి ధరలు హైదరాబాద్, చెన్నై, కేరళలో ఎక్కువగా, బెంగళూరులో తక్కువగా ఉన్నాయి. ఈ ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
రానున్న రోజుల్లో
దసరా, దీపావళి సీజన్ సమీపిస్తుండగా బంగారం పట్ల ఆకర్షణ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని, ఇదే సమయంలో ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంప్రదాయం, సంస్కృతి, పెట్టుబడి వంటి సందర్భాలలో బంగారానికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుందన్నారు. ఈ సీజన్‌లో బంగారం కొనుగోలు కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాక, ఆర్థిక భద్రత కోసం కూడా ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి