ఎలాంటి సర్వేలూ నిర్వహించలేదు: టీపీసీసీ
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:46 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి సర్వేలూ నిర్వహించలేదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి సర్వేలూ నిర్వహించలేదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ సహా పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్వేలు నిర్వహించిందని, పార్టీ పరిస్థితి బాగోలేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైదులు అనే వ్యక్తి కాంగ్రెస్ తరపున సర్వేలు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుందని, కానీ అతడికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.