Share News

Retrieve Your UAN: యూఏఎన్ నెంబర్ మర్చిపోయారా? ఇలా చిటికెలో తెలుసుకోండి..

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:41 PM

మీ పీఎఫ్ యూఏఎన్ నెంబర్ మర్చిపోయారా? మరేం పర్వాలేదు. టెన్షన్ పడకండి. ఇక మీ యూఏఎన్ నెంబర్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

Retrieve Your UAN: యూఏఎన్ నెంబర్ మర్చిపోయారా? ఇలా చిటికెలో తెలుసుకోండి..
EPF UAN Number

ఇంటర్నెట్ డెస్క్: ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ప్రతి నెలా జీతం పొందుతారు. వచ్చే జీతంలో బేసిక్ పేమెంట్స్, రూమ్ రెంట్స్, ఇన్సెంటీవ్స్ అని రకరకాల అమౌంట్‌తో కలిపి గ్రాస్ శాలరీ ఇస్తారు. ఇందులో కటింగ్స్ కూడా ఉంటాయి. వాటిలో ప్రధానంగా కట్ అయ్యేది పీఎఫ్ అమౌంట్. ప్రతి నెలా జీతం నుంచి పీఎఫ్ అమౌంట్ కట్ అవుతుంది. ఈ అమౌంట్ అంతా పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ అకౌంట్‌కు 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్(UAN) ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందనేది తెలుసుకోవాలంటే.. యూఏఎన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే, చాలా మంది ఉద్యోగులు తమ యూఏఎన్ నెంబర్ మర్చిపోతుంటారు. ఫలితంగా అవసరమైన సమయంలో వారు ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా మీ యూఏఎన్ నెంబర్ మర్చిపోయారా? టెన్షన్ పడకండి. క్షణాల్లో మీ యూఏఎన్ నెంబర్ తెలుసుకునే మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


UAN నెంబర్‌ను ఎలా తెలుసుకోవాలి..?

  • మీ UAN నెంబర్ పొందడం చాలా ఈజీ. ఇందుకోసంEPFO వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక వెసులుబాటు ఉంది.

  • మీ UAN నెంబర్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ సహా మరికొంత సమాచారం అవసరం అవుతుంది.

  • మీరు మీ UAN నెంబర్ కోసం ముందుగా EPFO వెబ్‌సైట్ unifiedportal-mem.epfindia.gov.in ని ఓపెన్ చేయాలి.

  • ఆ తరువాత Know Your UAN ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్‌మిట్ కొట్టాలి.

  • ఇప్పుడు మీరు పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఎంటర్ చేయాలి.

  • ఇప్పుడు స్క్రీన్‌పై UAN నెంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


UAN ఎందుకు అవసరం..?

యూఏఎన్(UAN) నెంబర్ లేకుండా పీఎఫ్ ఖాతాలోకి లాగిన్ అవ్వలేరు. మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోలేరు. పీఎఫ్ విత్‌డ్రా చేసుకోలేరు. అలాగే మీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్‌ని కొత్త కంపెనీకి బదిలీ చేయాల్సి వస్తే యూఏఎన్ తప్పనిసరి అవుతుంది. పీఎఫ్ ఖాతాకు సంబంధించిన ప్రతి చిన్న పనిలోనూ ఉద్యోగికి UAN నెంబర్ చాలా కీలకం.

SMS ద్వారా కూడా యూఏఎన్ నెంబర్ పొందవచ్చు..

మీరు మీ UAN నెంబర్‌ను ఎస్ఎంఎస్ ద్వారా కూడా పొందవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899 కు EPFOHO UAN ENG అని మెసేజ్ పంపించాలి. ఈ మెసేజ్ పంపిన కాసేపటి తరువాత మీ మొబైల్‌కి మీ యూఏఎన్ నెంబర్ వస్తుంది.


Also Read:

Smart innovation: ఈ రైతు ట్రిక్‌కు సలాం కొట్టాల్సిందే.. ధాన్యంను ఎలా బాగు చేస్తున్నాడో చూడండి..

Upgrades Grade Of Municipalities: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు మున్సిపాలిటీల గ్రేడ్ పెంపు

New Year Party Healthy Tips: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏం తినాలి? ఏం తినకూడదు?

Updated Date - Dec 31 , 2025 | 05:41 PM