Share News

Smart innovation: ఈ రైతు ట్రిక్‌కు సలాం కొట్టాల్సిందే.. ధాన్యాన్ని ఎలా బాగు చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:28 PM

చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Smart innovation: ఈ రైతు ట్రిక్‌కు సలాం కొట్టాల్సిందే.. ధాన్యాన్ని ఎలా బాగు చేస్తున్నాడో చూడండి..
clever hack goes viral

మనదేశంలో చాలా మంది సామాన్యులు కూడా అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (brilliant trick viral).


@MyWishIsUs అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక రైతు ధాన్యాన్ని బాగు చేస్తున్నాడు. ధాన్యంలోని గడ్డి, ఇతర చెత్తను వేరు చేయడానికి రైతులు చాలా శ్రమపడతారు. చాలా మంది వరుసగా నిల్చుని చేటలతో గాలి విసురుతారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాక్టర్‌కు పెద్ద ఫ్యాన్ అమర్చి ధాన్యం నుంచి గడ్డి, ఇతర చెత్తను వేరు చేస్తారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కూలర్‌ను ఉపయోగించి చాలా సులభంగా ధాన్యంను బాగు చేస్తున్నాడు (viral jugaad trick).


ఒక కూలర్ పైన ఒక అట్ట పెట్టను ఉంచి అందులో ధాన్యం వేస్తున్నారు (clever hack goes viral). ఆ బాక్స్ అడుగున ఉన్న రంధ్రం ద్వారా ధాన్యం బయటకు వస్తోంది. కూలర్ నుంచి వచ్చే గాలి గడ్డి నుంచి మలినాలను వేరు చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 8.7 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు.


ఇవి కూడా చదవండి..

బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..

మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 31 , 2025 | 05:41 PM