Share News

Fed Likely to Cut Interest Rates: వచ్చేనెలలో ఫెడ్‌ రేట్లు తగ్గే చాన్స్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:37 AM

ప్రామాణిక వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించేందు కు అవకాశాలున్నాయని అమెరికా సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ ..

Fed Likely to Cut Interest Rates: వచ్చేనెలలో ఫెడ్‌ రేట్లు తగ్గే చాన్స్‌

  • ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌

కాన్సాస్‌ (అమెరికా): ప్రామాణిక వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించేందు కు అవకాశాలున్నాయని అమెరికా సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలిచ్చారు. అయితే, మార్కెట్లో పెరిగిన అనిశ్చితులు పరపతి విధానంపై నిర్ణయాలను మరింత సంక్లిష్టతరం చేశాయని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కాన్సాస్‌ సిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాక్సన్‌ హోల్‌ సదస్సులో పావెల్‌ పేర్కొన్నారు. కాగా, ప్రామాణిక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకునేందుకు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌కు చెందిన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ వచ్చేనెల 16-17 తేదీల్లో భేటీ కానుంది. సమావేశం చివరి రోజున వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఫెడ్‌ రేట్ల తగ్గింపుపై పావెల్‌ తాజా సంకేతాలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీ ర్యాలీ సాధించింది. డౌజోన్స్‌ ఒకదశలో 900 పాయింట్ల (2 శాతం) మేర పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయిని నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 03:37 AM