September Deadline: స్పెషల్ FD సహా వీటికి సెప్టెంబర్ 30 లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే లాస్..
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:36 PM
సెప్టెంబర్ నెల చివరకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ గడువులు, FD సహా పలు ఆఫర్లు ముగియనున్నాయి. ఇవి మీ డబ్బును నేరుగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ నెలలో ఎలాంటి ముఖ్యమైన గడువులు ఉన్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వచ్చింది. ఈ సమయంలో పలు ఆర్థిక గడువులు, ఫిక్సిడ్ డిపాజిట్(FD)లపై ఉన్న ప్రత్యేక ఆఫర్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ముగుస్తాయి. కాబట్టి ఈ నెలలో ఎలాంటి కీలక డెడ్‌లైన్లు ఉన్నాయి? ఏ ఆఫర్లు క్లోజ్ అవుతున్నాయి? ఇవి మీ ఆదాయంపై లేదా పొదుపుపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువు
ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందించే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌లను అందిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్ 444-రోజుల, 555-రోజుల స్పెషల్ FD స్కీమ్‌లను అందిస్తున్నాయి. ఈ స్పెషల్ FDలలో పెట్టుబడి పెట్టడానికి గడువు సెప్టెంబర్ 30, 2025 వరకు మాత్రమే ఉంది. IDBI బ్యాంక్ 444, 555, 700 రోజుల స్పెషల్ FDలకు కూడా సెప్టెంబర్ 30, 2025 గడువు ఉంది. ఈ ఆఫర్లు మీ సొమ్మును లాభదాయకంగా పెట్టుబడి చేసేందుకు అవకాశాన్ని అందిస్తాయి. ఈ గడువును మిస్ చేస్తే, మీరు ఈ ఆకర్షణీయ వడ్డీ రేట్లను కోల్పోయే ఛాన్సుంది.
NPS నుంచి UPSకి మార్పు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి మారడానికి సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఉంది. ఈ మార్పు మీ భవిష్యత్తు పెన్షన్ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జన్ ధన్ ఖాతాల రీKYC
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన ప్రకారం, 10 సంవత్సరాలు పూర్తి చేసిన చాలా జన్ ధన్ ఖాతాలకు రీ-KYC అవసరం. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సెప్టెంబర్ 30, 2025 వరకు పంచాయతీ స్థాయిలో రీ-KYC పూర్తి చేయాలి. మీ ఖాతా యాక్టివేట్‌లో ఉండేందుకు ఈ గడువు లోపల రీ-KYC పూర్తి చేసుకోండి మరి.
హోమ్ లోన్ ఆఫర్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మాన్‌సూన్ బొనాంజా 2025 రిటైల్ లోన్ క్యాంపెయిన్‌లో హోమ్ లోన్, కార్ లోన్, ఇతర రిటైల్ లోన్ ఆఫర్లను ప్రారంభించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా కొత్త కారు కొనడానికి ఈ ఆఫర్ అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి