Chicken Rates Today: నేటి మార్కెట్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే.?
ABN , Publish Date - Dec 28 , 2025 | 09:06 AM
మార్కెట్లో ఈ వారం చికెన్, కోడిగుడ్ల ధరలు స్వల్పంగా ఎగబాకాయి. రిటైల్‌గా కిలో చికెన్ ధర ఆయా ప్రాంతాలను బట్టి రూ. 220 - రూ.260 మధ్య విక్రయిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చలికాలం కావడంతో చికెన్ రేట్లు కాస్తంత పెరిగాయి. ప్రస్తుతం.. ఏపీ మార్కెట్లలో కిలో స్కిన్‌లెస్ చికెన్(Chicken) రూ. 250 - రూ.260, స్కిన్‌తో రూ.280 వరకూ పలుకుతోంది. మరికొన్ని చోట్ల కిలో స్కిన్‌లెస్ రూ.240 నుంచి రూ.250 ఉండగా.. స్కిన్‌తో రూ.250 నుంచి రూ.260గా ఉంది. కిలో మటన్(Mutton) ధర ఆయా మార్కెట్లలో రూ.800గా కొనసాగుతోంది.
ఇక, తెలంగాణాలోని హైదరాబాద్(Hyderabad)లో స్కిన్‌లెస్ రూ.250 - 280గా అమ్ముడవుతోంది. కామారెడ్డిలో కిలో చికెన్ రూ.260గానూ, మటన్ కిలో రూ.800గా సేల్ అవుతోంది.
కోడిగుడ్ల(Eggs) విషయానికొస్తే.. గతవారం అమాంతం ఎగబాకిన గుడ్డు ధరలు ఈ వారం అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. రిటైల్‌గా ఒక్కో గుడ్డు ధర రూ.7 నుంచి రూ.8గా ఉంది. ఇక హోల్‌సేల్ మార్కెట్లో వీటి ధరలను పరిశీలిస్తే.. 100 గుడ్లు రూ.650గా మధ్య సేల్ అవుతోంది(Wholesale Egg Rates). దీంతో కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు గుడ్లను ఆహారంగా తీసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇప్పుడు ఇవీ భారమయ్యాయని చెప్పొచ్చు.
అయితే.. చలికాలంలో గుడ్లు, చికెన్ ధరల్లో పెరుగుదల అనేది సహజమని పలువురు వ్యాపారస్థులు అంటున్నారు. కానీ, గత కొన్నేళ్లుగా ఈ స్థాయిలో ధరలు పెరగుతాయని ఊహించలేదని వారు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోనే రోజుకు సగటున కోటి కోడిగుడ్లకు పైగా వాడుతున్నట్టు సమాచారం. ఇక తెలంగాణ వ్యాప్తంగా రోజుకు సరాసరిన సుమారు 3 కోట్ల మేర గుడ్లను వినియోగిస్తున్నట్టు అంచనా. దేశ వ్యాప్తంగా రోజుకు దాదాపు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లోనే ఐదింట ఒక వంతు ఉత్పత్తి కావడం గమనార్హం.
ఇవీ చదవండి:
ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..
పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..