Crypto Scam: నకిలీ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ వెబ్‌సైట్లతో జాగ్రత్త
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:53 AM
ఆన్ లైన్ ట్రేడింగ్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా ఈడీ.. 26 క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్రాస్-బార్డర్ మనీ ట్రైల్‌ను గుర్తించింది.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 28: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పాన్-ఇండియా సిండికేట్ నిర్వహిస్తున్న 26 నకిలీ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లను గుర్తించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లు నిజమైన ఎక్స్చేంజ్‌లను అనుకరిస్తూ, అసాధారణంగా ఎక్కువ రిటర్న్స్ హామీ ఇచ్చి భారత్, విదేశీ పెట్టుబడిదారులను మోసం చేశాయని తేల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో జరిపిన సోదాల్లో ఈ మోసం బయటపడింది.
సెలబ్రిటీల ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగించి, మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) తరహాలో ప్రారంభ పెట్టుబడిదారులకు కొంత రిటర్న్స్ ఇచ్చి మరింతమంది వ్యక్తులను ఆకర్షించారు. ఫండ్స్ క్రిప్టో వాలెట్స్, బ్యాంక్ అకౌంట్స్, హవాలా, P2P ట్రాన్సాక్షన్స్ ద్వారా క్రాస్-బార్డర్ మనీలాండరింగ్ చేశారు. ఈ సిండికేట్ 2015 నుంచి తన దందా కొనసాగిస్తూ అనేకమందిని మోసగించినట్టు ఈడీ గుర్తించింది.
ఈడీ గుర్తించిన కొన్ని నకిలీ సైట్లు: goldbooker.com, wozur.com, cryptexify.com, fincorp.com, bixotrade.org మొదలైనవి. సోషల్ మీడియా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్) ద్వారా ప్రచారం చేసుకుని నిర్వహించిన ఈ వందల కోట్ల రూపాయల మోసంపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..
పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..