Share News

Four Nominees For Bank Account: బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్

ABN , Publish Date - Oct 24 , 2025 | 02:54 PM

బ్యాంక్ ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం తీసుకు వచ్చిన ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. భారత్‌లోని మొత్తం బ్యాంకుల్లో దాదాపు రూ. 67 వేల కోట్లకు పైగా నగదు ఎవరూ వెనక్కి తీసుకోకుండా అలాగే ఉండిపోయింది.

Four Nominees For Bank Account: బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి ఇప్పటివరకూ ఒకరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. అయితే ఈ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలు కల్పించింది. కేంద్రం తీసుకు వచ్చిన ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. భారత్‌లోని మొత్తం బ్యాంకుల్లో దాదాపు రూ. 67 వేల కోట్లకు పైగా నగదు ఎవరూ వెనక్కి తీసుకోకుండా అలాగే ఉండిపోయింది.


అందుకు వివిధ కారణాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. అంటే అకౌంట్ ఉన్న వ్యక్తి మరణించిన తర్వాత.. ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని భావిస్తుంది. దీంతో కుటుంబసభ్యులు.. నగదు వెనక్కి తీసుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది. వీటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. ఈ నిబంధనలు బ్యాంక్ సేవింగ్ ఖాతా, ఎఫ్‌డీ, ఆర్డీ ఖాతాలతోపాటు లాకర్లకు సైతం వర్తిస్తాయి.


ఇక నవంబర్ 1వ తేదీ నుంచి మీ ఖాతాకు ఒకేసారి నలుగురి నామినీలగా పేర్కొనవచ్చు. అంతేకాదు.. ఎవరికి ఎంత వాటా వెళ్లాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఒకరి తర్వాత మరొకరు.. నలుగురు నామినీలను వరుస క్రమంలోనూ ఏర్పాటు చేయవచ్చు. అంటే మొదటి నామినీ అందుబాటులో లేకుంటే.. రెండో నామినీకి ఆ అర్హత వస్తుంది. ఇలా నలుగురిలో ఎవరుంటే వారికి అర్హత లభిస్తుంది. నామినీ పేర్లు నమోదు చేసేటప్పుడు.. వారి ఫోన్ నెంబర్లతోపాటు ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అందువల్ల బ్యాంకు వారిని సులభంగా సంప్రదించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇక బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు

ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలోకి ప్రీమియర్‌ ఎనర్జీస్‌

For More Business News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 03:56 PM