Share News

Premier Energies: ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలోకి ప్రీమియర్‌ ఎనర్జీస్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:21 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌.. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌కాన్‌ ఇండస్ట్రీస్‌ ఈక్విటీలో...

Premier Energies: ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలోకి ప్రీమియర్‌ ఎనర్జీస్‌

ట్రాన్స్‌కాన్‌ ఇండస్ట్రీ్‌సలో 51% వాటా కొనుగోలు

డీల్‌ విలువ రూ.500 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌.. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌కాన్‌ ఇండస్ట్రీస్‌ ఈక్విటీలో 51 శాతం వాటాను చేజిక్కించుకోవటం ద్వారా ఈ విభాగంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. ఈ 51 శాతం వాటాను రూ.500.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. కాలుష్య రహిత ఇంధన రంగంలో సమగ్ర కంపెనీగా ఎదిగేందుకు ఈ కొనుగోలు దోహదం చేస్తుందని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ పేర్కొంది. ట్రాన్స్‌కాన్‌.. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేస్తోంది.

పుణె కంపెనీలోనూ వాటా: ట్రాన్స్‌కాన్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు పుణె కేంద్రంగా పనిచేసే కేసోలార్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈక్విటీలోనూ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ.86.7 కోట్లతో 51 శాతం వాటా చేజిక్కించుకుంది. మిగతా 49 శాతం వాటాను సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.83.3 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా కేసోలార్‌ సంస్థ సోలార్‌ ఇన్వర్టర్ల తయారీలో ఉంది.

ఇవీ చదవండి:

ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..

రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 06:21 AM