Share News

Business Idea : డిగ్రీ పూర్తయిందా.. రోజులో ఎప్పుడైనా ఈ పనిచేయండి.. ఈజీగా నెలకు రూ.లక్ష సంపాదన..

ABN , Publish Date - Feb 13 , 2025 | 02:16 PM

Business Idea : డిగ్రీ లేదా బీటెక్ పూర్తయి ఉద్యోగాలు దొరక్క కొందరు చేసే పరిస్థితి లేక మరికొందరు ఇళ్ల వద్దే ఉండిపోతుంటారు. ఫ్రెండ్స్ బాగా సంపాదిస్తున్నాడు.. నేనేం చేయలేక పోతున్నానే అని నిరాశపడుతుంటారు. ఇప్పుడా చింత అక్కర్లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న టాప్ బిజినెస్‌ ఐడియాలలో ఒకటైన ఈ వ్యాపారం ట్రై చేసి చూడండి. బిజినెస్ అంటే పెట్టుబడి ఎలా అనుకోవచ్చు. అసలు దాంతో పెద్దగా పనే లేదు. మీ తెలివితేటలు, విజ్ఞానాన్నే ఇన్వెస్ట్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. తీరిక సమయంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చేసుకునే అవకాశం లభిస్తుంది.

Business Idea : డిగ్రీ పూర్తయిందా.. రోజులో ఎప్పుడైనా ఈ పనిచేయండి.. ఈజీగా నెలకు రూ.లక్ష సంపాదన..
Best Low Investment Business Idea

Business Idea : డిగ్రీ లేదా బీటెక్ పూర్తయి ఉద్యోగాలు దొరక్క కొందరు చేసే పరిస్థితి లేక మరికొందరు ఇళ్ల వద్దే ఉండిపోతుంటారు. ఫ్రెండ్స్ అంతా మంచి జాబ్ చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. నా పరిస్థితి మాత్రం మారలేదు. ఇలాగే ఉంది అని బాధపడుతుంటారు. పైగా ఇంట్లో వాళ్ల చివాట్లు, బంధువుల వెక్కిరింతలు ఎంత వేధిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ పక్కన పెట్టి సొంతంగా ఏదైనా చేయాలనే బలమైన ఆకాంక్ష, తపన మీలో ఉంటే చాలు. వయసు, పెట్టుబడి ఇవేవీ అవసరం లేదు. మీ చదువు, తెలివితేటలు ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఏ సమయంలోనైనా, ఏ ప్రాంతంలో అయినా ఈ పని చేసుకునే సౌలభ్యం ఉంది. మీ పనికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది.


ఎప్పుడైనా, ఎక్కడైనా చేసుకునే ఏకైక బిజినెస్ ఇదే..

కరోనా తర్వాత నుంచి భారతదేశంలో ఆన్‌లైన్ ట్యూటరింగ్ వ్యాపారం జోరు కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ మూలకైనా మీ విజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఈ వ్యాపారం ద్వారా లభిస్తుంది. ట్యూషన్లు చెప్పడానికి బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు. మీకు నచ్చిన సమయంలో షెడ్యూల్ సెట్ చేసుకోవచ్చు. పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఎలా చేసుకోవాలి అన్నది మీ ఇష్టం. ఇంట్లో బోర్‌గా ఉంది అనుకునేవారూ ఈ ఆన్‌లైన్ ట్యూటరింగ్ బిజినెస్ మొదలుపెట్టవచ్చు.Online-Tutoring.jpg


ఇప్పుడు ఆన్‌లైన్ ట్యూటరింగ్ బిజినెస్ చేయాలంటే ఏమేం కావాలో తెలుసుకుందాం.

పరిశోధన, ప్రణాళిక :

  • మీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించండి : మీరు ఏ సబ్జెక్టులో నిపుణులో, ఏ గ్రేడ్ స్థాయి వారికి బోధించగలరో నిర్ణయించుకోండి. (ఉదాహరణకు, గణితం, సైన్స్, ఇంగ్లీష్, CBSE, ICSE, మొదలైనవి).

  • మార్కెట్ పరిశోధన : భారతదేశంలో ఆన్‌లైన్ ట్యూటరింగ్ సేవలకు డిమాండ్, పోటీ, మార్కెట్ పరిస్థితిని విశ్లేషించండి.

  • ప్లానింగ్ : మీ లక్ష్యాలు, మార్కెటింగ్ వ్యూహాలు, ఆదాయ మార్గాల, కనీస పెట్టుబడికి కావలసిన వస్తువుల గురించి ప్రణాళిక వేసుకోండి.


లైసెన్స్ నమోదు :

  • మీ ఆన్‌లైన్ ట్యూటరింగ్ వ్యాపారాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC)తో ఏకైక యాజమాన్యం, భాగస్వామ్యం లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నమోదు చేసుకోండి.

  • GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఏవైనా ఇతర అవసరమైన లైసెన్సులు (ఉదా. షాప్, ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం లైసెన్స్) పొందండి.


ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ :

  • ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోండి : మీ స్వంత వెబ్‌సైట్‌ను నిర్మించాలా లేదా జూమ్, గూగుల్ మీట్ లేదా ఆన్‌లైన్ ట్యూటరింగ్ మార్కెట్‌ప్లేస్‌ల వంటి ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలా అని నిర్ణయించుకోండి.

  • వెబ్‌సైట్ లేదా ల్యాండింగ్ పేజీ : మీ సేవలు, ట్యూటర్లు, టెస్టిమోనియల్‌లను ప్రదర్శించడానికి ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ లేదా ల్యాండింగ్ పేజీని సృష్టించండి.

  • ఆన్‌లైన్ వైట్‌బోర్డ్‌లు, స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్, పేమెంట్ గేట్‌వే వంటి సాధనాలపై పెట్టుబడి పెట్టడం అవసరం.


ట్యూటర్ల నియామకం, శిక్షణ :

  • పెద్ద స్థాయిలో చేస్తుంటే మీరు ఎంచుకున్న సబ్జెక్టులను బోధించగల అనుభవజ్ఞులు, అర్హత కలిగిన ట్యూటర్లను నియమించుకోండి.

  • ఆన్‌లైన్ బోధనా పద్ధతులు, టూల్స్, సాఫ్ట్‌వేర్‌లపై ట్యూటర్లకు శిక్షణ ఇవ్వండి.

  • స్టూడెంట్స్ సంఖ్య పెంచుకునేందుకు సోషల్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, చెల్లింపు ప్రకటనలను వాడుకోండి.

  • ఆకర్షణీయమైన నాణ్యతగల కంటెంట్ ద్వారా కస్టమర్ల సంఖ్యను పెంచుకోండి.

  • జస్ట్‌డయల్, సులేఖ, అర్బన్‌ప్రో వంటి ఆన్‌లైన్ డైరెక్టరీలలో మీ ఆన్‌లైన్ ట్యూటరింగ్ వ్యాపారాన్ని జాబితా చేయండి.


ప్రారంభం, కార్యకలాపాలు :

  • మీ ఆన్‌లైన్ ట్యూటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి విస్తరించేందుకు తగిన కృషి చేయండి.

  • కస్టమర్ విచారణలు, బుకింగ్‌లు, చెల్లింపులు, ట్యూటర్ నిర్వహణ కార్యకలపాలు జాగ్రత్తగా నిర్వహించండి.

  • మీ వ్యాపార పనితీరును నిరంతరం పర్యవేక్షించండి. కస్టమర్ల అభిప్రాయాన్ని సేకరించి మీ సేవలు, లాభాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి.

పైన చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే, ఆన్‌లైన్ ట్యూటరింగ్ వ్యాపారం విజయవంతంగా కొనసాగించగలరు.


ఇవి కూడా చదవండి..

Notes to Coins: ఎక్కువమొత్తంలో చిల్లర కావాలా.. ఇలా చేస్తే ఉచితంగా కావాల్సినంత దొరుకుతుంది..

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే..

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 02:16 PM