Share News

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Feb 13 , 2025 | 10:23 AM

అమెరికా వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతల కారణంగా భారీ నష్టాలను చవి చూస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమై కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు సాగించడంతో లాభాల బాట పట్టాయి.

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

అమెరికా వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతల కారణంగా భారీ నష్టాలను చవి చూస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమై కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు సాగించడంతో లాభాల బాట పట్టాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Business News)


బుధవారం ముగింపు (77, 171)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 190 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. అయితే కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో లాభాల్లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో 444 పాయింట్ల లాభంతో 76, 615 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 132 పాయింట్ల లాభంతో 23, 178 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో ముత్తూట్ ఫైనాన్స్, జుబిలెంట్ ఫుడ్స్, ఎస్‌బీఐ కార్డ్, అరబిందో ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారత్ ఫోర్జ్, వరుణ్ బేవరేజెస్, ఒబెరాయ్ రియాలిటీ, బాటా ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 670 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 10:23 AM