Bank Holidays In November 2025: నవంబర్‌లో బ్యాంకులకు ఇన్ని సెలవులా.. ఇదిగో జాబితా..
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:32 PM
నవంబర్ మాసంలో బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ జాబితాని అనుసరించి కస్టమర్లు.. అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.
Bank Holidays In November 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025, నవంబర్ మాసానికి సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో.. నెలలో10 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వీటిలో ఆదివారం, రెండు, నాలుగు శనివారాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు కారణంగా సెలవులు సైతం ఆ జాబితాలో ఉన్నాయి. దీంతో ఈ మాసంలో బ్యాంకులకు 12 సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల సెలవులను దృష్టిలో ఉంచుకుని.. తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను కస్టమర్లు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
2025 నవంబర్ మాసంలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..
నవంబర్ 1 (శనివారం): కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో సెలవు. అలాగే ఉత్తరాఖండ్‌లో ఇగాస్- బగ్వాల్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 2: ఆదివారం
నవరంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా పలు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 7 (శుక్రవారం): మేఘాలయాలో వంగల పండగ. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవులు.
నవంబర్ 8 (శనివారం) : రెండో శనివారం
నవంబర్ 9: ఆదివారం
నవంబర్ 11 (మంగళవారం): లహాబ్ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
నవరంబర్ 16: ఆదివారం
నవంబర్ 22: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 23 : ఆదివారం
నవంబర్ 25: (మంగళవారం): గురు తేజ్ బహదూర్ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హర్యానాతోపాటు ఛండీగఢ్‌లోని బ్యాంకులన్నింటికి సెలవు.
నవంబర్ 30: ఆదివారం
ఇవి కూడా చదవండి:
త్వరలో కొత్త ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా..
నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై నలుగురికి అవకాశం
For More Business News And Telugu News