Financial changes: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై నలుగురికి అవకాశం
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:42 PM
బ్యాంక్ ఖాతాదారుడి నామినీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కరు నామినీ కాకుండా.. నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 29: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా నవంబర్ నెలలో కొన్ని మార్పులు జరుగనున్నాయి. బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అకౌంట్ హోల్డర్ కి ఒక నామినీ మాత్రమే ఉండటం వల్ల ఆ నామినీ అందుబాటులో లేకపోవడం, నగదు క్లెయిమ్ చేసుకోకపోవడంతో ఆ డబ్బు అలాగే ఉండిపోతుంది. ఇలా మన దేశంలోని మన బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు అలాగే ఉండిపోయింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఖాతాదారుడికి ఒక్కరు నామినీ కాకుండా.. నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చు. ఖాతాదారుడి నిర్ణయం మేరకు నామినీలకు చివరి మొత్తాన్ని బ్యాంక్ అందజేస్తుంది. ఖాతాదారుడి మరణానంతరం డబ్బు విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలు నివారించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులో నవంబర్ 1 నుంచి స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. యాప్ వాలెట్ లోడింగ్, ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులకు సంబంధించి కొత్త ఛార్జీలు ప్రవేశబెట్టనున్నారు. క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై ఇకపై 1 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లు, పీఓఎస్ మెషీన్ల వద్ద చేసే ట్రాన్సాక్షన్ లకు ఈ ఫీజు వర్తించదు. ఇక వాలెట్‌లో రూ.1000కి మించి చేసే లావాదేవీలకు 1 శాతం ఫీజు ఉండనుంది.
ఇవి కూడా చదవండి:
Man Pushes Wife from Roof: కోరిక తీర్చలేదని భార్యపై భర్త దారుణం..
Gold Rates On Oct 29: ధరల తగ్గుదలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్