Share News

Bank Holiday: సెప్టెంబర్ 5న బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా.. క్లారిటీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:46 PM

మీరు రేపు అంటే సెప్టెంబర్ 5, 2025న బ్యాంకు పని కోసం వెళ్లాలని చూస్తున్నారా. అయితే ఓ సారి మీ ప్రాంతంలో సెలవు ఉందో లేదో తెలుసుకుని వెళ్లండి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Bank Holiday: సెప్టెంబర్ 5న బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా.. క్లారిటీ
September 5 bank holiday

మనకి అవసరం ఉన్నప్పుడు బ్యాంకుకి వెళ్లి పని పూర్తి చేయాలనుకుంటే మాత్రం, బ్యాంక్ ఓపెన్ ఉందా లేదా అన్నది ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు సెప్టెంబర్ 5, 2025న బ్యాంకులు ఓపెన్ ఉంటాయా లేదా అన్నది అనేక మందికి డౌట్ ఉంది (September 5 bank holiday). అయితే సెలవు ఉంటే ఏ ప్రాంతాల్లో ఉంది, ఎక్కడ లేదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో సెప్టెంబర్ 5న రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇద్-ఎ-మిలాద్-ఉన్-నబి (Eid-e-Milad-un-Nabi), రెండోది తిరువోణం (Thiruvonam). ఇద్ మిలాద్ అనేది ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే ముస్లిం పండుగ. తిరువోణం పండుగ ముఖ్యంగా కేరళలో ఘనంగా జరుపుకుంటారు.


ఈ ప్రాంతాల్లో సెలవు

ఇది నేషనల్ హాలిడే కాదు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం హైదరాబాద్ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), కాన్పూర్ (ఉత్తరప్రదేశ్), లక్నో (ఉత్తరప్రదేశ్), ఢిల్లీ, భోపాల్ (మధ్యప్రదేశ్), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), జమ్మూ (జమ్మూ & కశ్మీర్), బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), తిరువనంతపురం (కేరళ), కొచ్చిన్ (కేరళ), ఇంఫాల్ (మణిపూర్), ఐజ్వాల్ (మిజోరం)ప్రాంతాల్లో సెప్టెంబర్ 5న సెలవు ఉంటుంది. కానీ అగర్తలా, జైపూర్, కోల్‌కతా వంటి మిగతా ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరిచే ఉంటాయి.

సెప్టెంబర్ 6న (శనివారం) గ్యాంగ్‌టాక్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేస్తాయి. ఇది ఈ నెలలో వచ్చిన మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు ఉండదు. రెండో, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులు బంద్ ఉంటాయి.


ఆన్‌లైన్‌ మాత్రం

బ్యాంకులకు సెలవు ఉన్నా కూడా ఆన్‌లైన్‌ లావాదేవీలు మాత్రం కొనసాగుతాయి. నెట్, మొబైల్ బ్యాంకింగ్‌, యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్‌ఫర్, బిల్లు పేమెంట్లు, రీచార్జ్‌లు, ఖాతా నిల్వల తనిఖీ లాంటి సేవలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. బ్యాంకు బ్రాంచ్‌లు పనిచేయకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు 24x7 పనిచేస్తాయి. దీంతో అవసరమైన లావాదేవీలను ఇంటి నుంచే సురక్షితంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 06:28 PM